Health | శరీరం నుంచి దుర్వాసన వస్తుందా? ఇది అనారోగ్యానికి సంకేతమే.. జాగ్రత్త పడండి!
Health | సువాసనలే కాదు, దుర్వాసనలూ రకరకాలు. ఒక్కో వాసన ఓ అనారోగ్యాన్నిసూచిస్తుంది. ఆ సంకేతాన్ని అర్థం చేసుకోగలిగితే.. ఇదో హెచ్చరికలానూ పనిచేస్తుంది. అరచేతులు, చంకలు, వ్యక్తిగత భాగాలు, పాదాలు.. శరీరంలో చెడువాసన కార్ఖానాలు అనేకం.
Health | సువాసనలే కాదు, దుర్వాసనలూ రకరకాలు. ఒక్కో వాసన ఓ అనారోగ్యాన్నిసూచిస్తుంది. ఆ సంకేతాన్ని అర్థం చేసుకోగలిగితే.. ఇదో హెచ్చరికలానూ పనిచేస్తుంది. అరచేతులు, చంకలు, వ్యక్తిగత భాగాలు, పాదాలు.. శరీరంలో చెడువాసన కార్ఖానాలు అనేకం. మనం తినే ఆహారాన్ని బట్టి, మనల్ని పీడిస్తున్న ఆరోగ్య సమస్యలను బట్టి, మనం వాడే మందుల్ని బట్టి కూడా వాసన మారిపోతుంది.
➣ లైంగిక వ్యాధులు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తదితర రుగ్మతలు ఉన్నవారి దగ్గర మూత్రాన్ని గుర్తుకుతెచ్చే దుర్వాసన గుప్పుమంటూ ఉంటుంది.
➣ కొందరి నుంచి పులిసిన పండ్లను గుర్తుకుతెచ్చేలా దుర్వాసన వస్తూ ఉంటుంది. మధుమేహం ఉన్నవారిలో ఇలాంటి ఇబ్బంది ఎక్కువ.
➣ ఎసిడిటీ బాధితులు నోరు తెరిస్తే చాలు.. చెత్తకుప్ప పక్కన నిలబడినట్టు అనిపిస్తుంది.
➣ కొందరికి ముక్కులోంచి కూడా దుర్వాసన వస్తుంది. నాసికంలోని నాళాలలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.
➣ చెవికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు అటువైపు నుంచి కూడా దుర్వాసన విస్తరిస్తుంది.
➣ ఫంగస్ దాడికి గురైనప్పుడు పాదాలు కంపుకొడతాయి.
➣ మలమూత్రాలు ఒక పరిమితికి మించి దుర్వాసనను వెదజల్లుతుంటే తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.
➣ చాలామంది ఈ సమస్యను అత్తర్లతోనో, టాల్కం పౌడర్ల తోనో కప్పిపెట్టాలని చూస్తారు. నిజానికి దుర్వాసన ఓ రుగ్మత కాదు. ఒకానొక రుగ్మతకు సంకేతం. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

