Health Tips | సహజ సిద్ధంగా చర్మం మెరవాలంటే..!
వయసుతో పనిలేకుండా ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని కోరుకోని వారు అరుదు. వయసు మీద పడటాన్ని (Health Tips) జాప్యం చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు.
న్యూఢిల్లీ : వయసుతో పనిలేకుండా ఎప్పటికీ యవ్వనంగా ఉండాలని కోరుకోని వారు అరుదు. వయసు మీద పడటాన్ని (Health Tips) జాప్యం చేసేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం మార్కెట్లో లభించే లోషన్లు, సీరం పూసేస్తుంటారు. అయితే ఈ ఉత్పత్తులు అన్నీ డొల్లేనని చెప్పలేకున్నా సహజసిద్ధంగా చర్మం నిగారింపుతో ఉండేలా చూసుకోవడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో చర్మం లోపలనుంచి తాజాదనాన్ని సంతరించుకుని అందం, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
డీటాక్స్‌తో పాటు వయోభారాన్ని జాప్యం చేస్తూ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఆహార పదార్ధాలు, పానీయాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు, జాయింట్స్, బ్లడ్, కండరాలు, కార్టిలేజ్‌లో ఉండే కొలాజెన్ ఆరోగ్యవంతంగా కనిపించే చర్మానికి అత్యవసరమైన ప్రొటీన్ అని కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా చెబుతున్నారు.
కొలాజెన్ చర్మం బిగుతుగా, బలంగా ఉండేలా చేస్తుంది. వయోభారం, ఇతర కారణాలతో కొలాజెన్ తగ్గడంతో చర్మం బిగుతును కోల్పోయి చర్మంపై ముడతలు ఏర్పడతాయి. ఇక చర్మంలో కొలాజెన్‌ను మెరుగుపరుచుకునేందుకూ రోజు సరిపడా నీళ్లు తాగడంతో పాటు యాంటీఆక్సిడెంట్స్‌తో కూడిన ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. విటమన్ సీతో కూడిన ఆహార పదార్ధాలను అధికంగా తీసుకోవాలి. పరిమితంగా మద్యం తీసుకోవడంతో పాటు తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read More :
The Diary of a CEO | ఈ 14 సూత్రాలు పాటిస్తే మీ లైఫ్‌కి మీరే బాస్ అవ్వొచ్చు!
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- collagen
- health tips
- skin
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

