పాప కుంటుతున్నది
మా అమ్మాయికి నాలుగేండ్లు. కొద్దిరోజులుగా కుంటినట్టు నడుస్తున్నది. వేగంగా అడుగులు వేయలేదు. పరిగెత్తనూలేదు. నొప్పి ఉందేమో అనిపిస్తుంది. మిగతా విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. ఏ ఆరోగ్య సమస్యలూ లేవు. ప్రీ స్కూల్లో వేశాం. అక్కడ కూడా చురుగ్గానే ఉంటుంది.
- పిల్లల పెంపకం
మా అమ్మాయికి నాలుగేండ్లు. కొద్దిరోజులుగా కుంటినట్టు నడుస్తున్నది. వేగంగా అడుగులు వేయలేదు. పరిగెత్తనూలేదు. నొప్పి ఉందేమో అనిపిస్తుంది. మిగతా విషయాల్లో సాధారణంగానే ఉంటుంది. ఏ ఆరోగ్య సమస్యలూ లేవు. ప్రీ స్కూల్లో వేశాం. అక్కడ కూడా చురుగ్గానే ఉంటుంది. మాకేమో ఆందోళనగా ఉంది. ఏం చేయాలో తోచడం లేదు.
-
- ఓ పాఠకురాలు
బిడ్డ సాధారణంగా నడవలేకపోవడం తీవ్ర సమస్యే. స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు కింద పడిందేమో తెలుసుకోండి. కాలికి దెబ్బలు తగిలాయేమో పరీక్షించండి. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పిల్లలు గాయాల గురించి చెప్పరు. మౌనంగా నొప్పిని భరిస్తారు. ఓసారి పరీక్షించి చూడండి. అన్నిసార్లూ గాయాలు బయటికి కనిపించకపోవచ్చు కూడా. కొన్నిసార్లు జలుబు, దగ్గు తదితర ఇన్ఫెక్షన్ల తర్వాత మోకీళ్లలో నీళ్లు చేరుతాయి. దీన్నే ‘రియాక్టివ్ ఆర్థరైటిస్’ అంటారు. దీంతో, కదలికల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. సరిగా నడవలేరు. లేదంటే, జాయింట్ ఇన్ఫెక్షన్ అయినా కావచ్చు. తీవ్రమైన నీరసం, ధారాళంగా చెమటలు దీని లక్షణాలు. కారణం ఏదైనా, ఒకసారి పీడియాట్రీషియన్‌ను కలవండి. అవసరమైతే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్‌ను కూడా సంప్రదించండి. డాక్టర్ సిఫారసుతో బ్లడ్ టెస్ట్, స్కానింగ్ తదితర పరీక్షలు చేయించండి. భయపడాల్సిన పన్లేదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

