వర్టిగో.. డోన్ట్ వర్రీ
మీరు మామూలుగా ఉన్నప్పటికీ తల తిరిగినట్టుగా ఉండటం, లేదంటే పరిసరాలు తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందడాన్ని వర్టిగో అంటారు.
మీరు మామూలుగా ఉన్నప్పటికీ తల తిరిగినట్టుగా ఉండటం, లేదంటే పరిసరాలు తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందడాన్ని వర్టిగో అంటారు. వర్టిగో సాధారణంగా మన లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు తలెత్తుతుంది. అంతేకాకుండా, ఇన్ఫెక్షన్లు, మైగ్రేన్స్, మెదడులో ట్యూమర్ లేదంటే, స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా తలెత్తుతుంది. సమస్య కారణాన్ని బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది వర్టిగోతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో అసలు వర్టిగో అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? దీనికి గల కారణాలేంటి? ఈ సమస్యను ఎలా గుర్తించాలి? అందుబాటులో ఉన్న చికిత్స విధానాల గురించి నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
నిజానికి వర్టిగో అనే రుగ్మత సర్వసాధారణం అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ సమస్యతో వైద్యుల దగ్గరికి వస్తున్నారు. వర్టిగో సమస్య తలెత్తినప్పుడు సాధారణంగా తల తిరిగినట్టుగా అనిపిస్తుంది, లేదంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే, ఈ సమస్య దానంతట అదిగా వస్తుంది. లేదంటే ఇతర అనారోగ్య సమస్యల కారణాల వల్ల కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. వర్టిగో ప్రధానంగా పెరిఫెరల్ వర్టిగో, సెంట్రల్ వర్టిగో అని రెండు రకాలు.
పెరిఫెరల్ వర్టిగో
పెరిఫెరల్ వర్టిగో సమస్య చాలామందిలో సర్వసాధారణం. చెవిలో ఉండే ఇన్నర్ ఇయర్గాని లేదా వినికిడికి సంబంధించిన నరం ప్రభావితమైతే దానిని పెరిఫెరల్ వర్టిగో అంటారు. ప్రధానంగా 4 కారణాల వల్ల పెరిఫెరల్ వర్టిగో రావొచ్చు. అవి… బినైన్ పెరాగ్జిస్మల్ పొజిషనల్ వర్టిగో (బీపీపీవీ), రెండోది లాబ్రింథైటిస్, మూడోది వెస్టిబ్యులర్ న్యూరైటిస్, నాలుగోది మీనియర్స్ డిసీజ్.
బినైన్ పెరాగ్జిస్మల్ పొజిషనల్ వర్టిగో (బీపీపీవీ): బీపీపీవీ అనేది పెద్ద ప్రమాదకారేమీ కాదు. దీనివల్ల పక్కకు తిరిగి పడుకున్నప్పుడు కళ్లు తిరిగినట్లుగా ఉంటుంది. అంటే పడుకునే పొజిషన్ మారినప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
లాబ్రింథైటిస్: చెవి లోపల ఉండే ల్యాబ్రింథ్స్ దెబ్బతినడం వల్ల వర్టిగోతో పాటు వినికిడి సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు.
వెస్టిబ్యులర్ న్యూరైటిస్: చెవికి సంబంధించిన నరం దెబ్బతినడం వల్ల వెస్టిబ్యులర్ న్యూరైటిస్ వర్టిగో సమస్య వస్తుంది.
మీనియర్స్ డిసీజ్: ఇది కూడా లోపలి చెవి దీర్ఘకాలికంగా దెబ్బతినడం వల్ల వస్తుంది. దీనివల్ల తల తిరగడంతోపాటు వినికిడి శక్తి తగ్గుతుంది. అంతేకాకుండా చెవిలో గుయ్యిమంటూ శబ్దం వస్తుంది. దీని కారణంగా కొన్ని సార్లు వాంతులు కూడా అవుతుంటాయి.
సెంట్రల్ వర్టిగో
మెదడు దెబ్బతినడం వల్ల సెంట్రల్ వర్టిగో సమస్య తలెత్తుతుంది. అంటే మెదడుకు ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గానీ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల, లేదంటే తలకు ఏదైనా దెబ్బ తగలడం వల్ల సెంట్రల్ వర్టిగో రావచ్చు. సాధారణంగా సెంట్రల్ వర్టిగో ఉన్నవారు నడవడానికి ఇబ్బంది పడుతుంటారు.
వర్టిగో లక్షణాలు
- తల తిరగడం లేదా కళ్లు తిరగడం
- వాంతులు వచ్చినట్లు అనిపించడం
- తల తేలికగా ఉండడం
- వినికిడి శక్తి తగ్గడం
- చెవుల్లో గుయ్యిమంటూ శబ్దం రావడం
- తీవ్రమైన తలనొప్పి
- చెవిలో ఏదో ఉన్న అనుభూతి
ప్రధాన కారణాలు
- పార్శపునొప్పి కారణంగా వర్టిగో రావచ్చు.
- కొన్ని రకాల యాంటీబయాటిక్స్, వాపు తగ్గేందుకు వాడే మందులు, గుండె సంబంధిత మందులు తీసుకుంటే కూడా వర్టిగో వచ్చే అవకాశాలు ఉంటాయి.
- బ్రెయిన్ స్ట్రోక్ వల్ల.
- తలకు ఏదైనా గాయం అయినప్పుడు.
- చెవి నరానికి సంబంధించిన అకాస్టిక్ న్యూరోమా కారణంగా.
- రక్తపోటు (బీపీ) తగ్గితే కూడా వర్టిగో రావచ్చు.
వర్టిగో వల్ల అనర్థాలు
- వర్టిగో వల్ల రోగి తలతిరిగి కిందపడే అవకాశాలు ఎక్కువ. దీని కారణంగా కింద పడినప్పుడు ఎముకలు విరిగిపోవచ్చు.
- కొన్నిసార్లు రోజువారీ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడవచ్చు.
చికిత్స విధానం
- డాక్టర్లు రోగితో కొంత సమయం కేటాయించి, వ్యాధి నేపథ్యం తెలుసుకోవాలి. ఆ వివరాల ఆధారంగా కొన్ని పద్ధతులతో చికిత్స చేయవచ్చు. ముఖ్యంగా పెరిఫెరల్ వర్టిగోకు రీపొజిషనింగ్ మాన్యువల్‌తో సమస్య నుంచి ఉపశమనం కలిగించవచ్చు.
- కొన్ని రకాల మందులతో కూడా వర్టిగో లక్షణాలను తగ్గించవచ్చు. వెస్టిబ్యులర్ రీహాబిలిటేషన్ థెరపీ ద్వారా పెరిఫెరల్ వర్టిగోను తగ్గించుకోవచ్చు. ఈ రోగులకు శస్త్రచికిత్స చాలా అరుదుగా అవసరమవుతుంది.
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
వర్టిగో లక్షణాలు ఎక్కువగా కనిపించినా, వర్టిగోతోపాటు ఛాతీలో నొప్పి గాని, గుండెలో దడ గాని, లేదా తలనొప్పి గాని, నడుస్తుంటే తూలడం, జ్వరంతోపాటు తల తిరుగుతున్నా, చూపులో తేడా వచ్చినా, ఒక చెయ్యి, కాలు బలహీనమైనా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వర్టిగో అనేది అకస్మాత్తుగా రావచ్చు. దీనివల్ల ఆందోళన కలగవచ్చు. పైగా వర్టిగో ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించకుండానే వస్తుంది. ఈ సమస్య భయం కలిగించినప్పటికీ చాలాసార్లు ఎంతో సులువుగా తగ్గిపోతుంది. కానీ ఇది ఎక్కువసేపు ఉంటే, అందుకు ఇతర అనారోగ్య సమస్యలు కారణమై ఉండవచ్చు. అంతేకాకుండా వర్టిగో కారణంగా రోజువారీ జీవితం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి.
నిర్ధారణ పద్ధతులు
- ముందుగా రోగిని పరీక్షించి, కొన్ని రకాల ప్రశ్నలతో వ్యాధిని అంచనా వేయవచ్చు.
- క్లినికల్ ఎగ్జామినేషన్‌లో కొన్ని రకాల పరీక్షలు.. అంటే హెడ్ ఇంపల్స్ టెస్టుల ద్వారా కూడా వర్టిగోను నిర్ధారించవచ్చు.
- ఆడియోమెట్రీ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.
- సీటీ స్కాన్ చేయడం ద్వారా.
- ఎంఆర్ఐతో సైతం వర్టిగోను నిర్ధారించవచ్చు.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ జి.వి.సుబ్బయ్య చౌదరి సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యశోద హాస్పిటల్, హైటెక్‌సిటీ
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

