Moringa Leaves | రోజూ మునగాకులను ఏదో ఒక విధంగా తినాల్సిందే.. లేదంటే ఈ లాభాలను కోల్పోతారు..!
మన చుట్టూ పరిసరాల్లో అనేక మొక్కలు, వృక్షాలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద పరంగా ఔషధాలుగా ఉపయోగపడేవి చాలానే ఉంటాయి. కానీ చాలా వరకు చెట్లను మనం అంతగా పట్టించుకోం.
Moringa Leaves | మన చుట్టూ పరిసరాల్లో అనేక మొక్కలు, వృక్షాలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఆయుర్వేద పరంగా ఔషధాలుగా ఉపయోగపడేవి చాలానే ఉంటాయి. కానీ చాలా వరకు చెట్లను మనం అంతగా పట్టించుకోం. వాటిల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు. అవును, అలాంటి వృక్షాల్లో మునగ చెట్టు కూడా ఒకటి. ఇది మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది. మునగ కాయలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ కాయలతో అనేక రకాల వంటకాలను కూడా చేస్తుంటారు. అయితే మునగ కాయలే కాదు మునగ ఆకులు కూడా మనకు ఎంతగానో మేలు చేస్తాయి. మునగ ఆకులను సూపర్ ఫుడ్‌గా కూడా వైద్యులు చెబుతుంటారు. వీటితో 300 వరకు రోగాలను నయం చేసుకోవచ్చని అంటుంటారు. మునగాకుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక మునగాకులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి..
మునగాకులను నేరుగా ఎవరూ తినలేరు. కానీ పొడిలా చేసి వాడుకోవచ్చు. లేదా ఈ ఆకులతో పచ్చడి, పప్పు వంటివి చేసి కూడా తినవచ్చు. సాంబార్ లేదా రసం వంటి వాటిల్లోనూ ఈ ఆకులను వేసి వండుకోవచ్చు. మునగ ఆకులను తింటూ ఉంటే క్రమంగా రుచిగానే అనిపిస్తాయి. ఈ ఆకులను తినడం వల్ల అనేక యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మునగాకుల్లో ఫైబర్, అవసరం అయిన అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇవి జీర్ణక్రియను పెంచుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
రోగాలు రావు..
మునగాకుల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల మునగాకులను తింటే సుమారుగా 18 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. అలాగే 9100 ఐయూ మేర విటమిన్ ఎ, 130 మిల్లీగ్రాముల క్యాల్షియం, 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తాయి. ఇవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. మునగాకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల మునగాకులను తింటే సుమారుగా 220 మిల్లీగ్రాముల మేర విటమిన్ సి లభిస్తుంది. అలాగే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాము. రోగాలు రాకుండా చూసుకోవచ్చు. మునగాకుల్లో ఉండే విటమిన్ ఎ, సి కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడతాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు పోతాయి. యవ్వనంగా కనిపిస్తారు.
షుగర్ లెవల్స్ తగ్గుతాయి..
మునగాకులను తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. దీంతో నీరసం, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీర శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఉదయం ఈ ఆకులను తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసిపోరు. మునగాకుల్లో అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మునగాకులను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి మునగాకులను ఒక వరం అనే చెప్పవచ్చు. ఇలా మునగాకులను తినడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ ఏదో ఒక విధంగా తినడం మరిచిపోకండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

