Health tips: పుదీనాతో జలుబు, గొంతునొప్పి మటుమాయం.. శ్వాస సమస్యలకు దివ్యౌషధం..!
Health tips: పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో

Health tips: పుదీనాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తరచూ వంటల్లో పుదీనాను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ మూలకాలు, సీ, డీ, ఈ, బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. మరి ఆరోగ్యపరంగా పుదీనాతో ఎన్ని లాభాలున్నాయో ఒకసారి తెలుసుకుందామా..?
- పుదీనా ఆకులను తరచూ ఆహారంలో తీసుకోవడంవల్ల కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి. కడుపులో వికారంగా అనిపించినప్పుడు ఒక కప్పు పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
- శ్వాస సంబంధమైన సమస్యలకు కూడా పుదీనా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గిన్నెలో వేడినీళ్లు పోసి, దాంట్లో నాలుగైదు చుక్కల పుదీనా నూనె వేసి ఆవిరి పట్టుకుంటే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
- పుదీనా అలర్జీ, ఉబ్బసం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే పుదీనాను తరచూ కూరల్లో
ఉపయోగించాలి. అదేవిధంగా అచ్చం పుదీనాను పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు. - పుదీనా టీ తాగడం ద్వారా జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది.
- ఇక పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చి పుదీనా ఆకులను తరచూ
నమలడంవల్ల నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

