Health Tips | మైండ్ డైట్‌తో జీవనశైలి వ్యాధులకు చెక్
ఆధునిక జీవనశైలితో వ్యాధుల ముప్పు పెరిగిపోతుండటంతో పెద్దసంఖ్యలో ప్రజలు తమ ఆరోగ్య అలవాట్లను (Health Tips) మార్చుకుంటూ కఠిన ఆహార నియమాలు, డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు.
న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలితో వ్యాధుల ముప్పు పెరిగిపోతుండటంతో పెద్దసంఖ్యలో ప్రజలు తమ ఆరోగ్య అలవాట్లను (Health Tips) మార్చుకుంటూ కఠిన ఆహార నియమాలు, డైట్ ప్లాన్లను అనుసరిస్తున్నారు. కీటో నుంచి డ్యాష్, మైండ్, మెడిటేర్రేనియన్ వంటి ఎన్నో డైట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరి ఫిట్నెస్ లక్ష్యాలు, ఆరోగ్యపరమైన అంశాల ఆధారంగా ఒక్కో డైట్ ప్లాన్ అనుసరించాల్సి ఉంటుంది. ప్రతి డైట్ ప్లాన్‌కూ ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలూ ఉండటంతో పలువరు తరచూ తమ డైట్ ప్లాన్లను మార్చుతుంటారు.
ఇక హృద్రోగం నుంచి మధుమేహం, అధిక రక్తపోటు వరకూ పలు వ్యాధులను నివారించడంతో పాటు నియంత్రించే శక్తి కలిగిన డైట్‌గా మైండ్ డైట్ ప్రాచుర్యం పొందుతోంది. మెడిటెర్రేనియన్, డ్యాష్ డైట్లను మేళవిస్తూ కొన్ని మార్పులతో మైండ్ డైట్ ముందుకొచ్చింది. ఈ డైట్ ప్లాన్ ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారంతో డిజైన్ చేయబడింది. ఈ డైట్లో జంతు సంబంధ ఆహారాన్ని పరిమితం చేయడం, సంతృప్త కొవ్వులు, అదనపు చక్కెరలతో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఇక మైండ్ డైట్ ప్రధానంగా బరువు తగ్గడంపై కాకుండా గుండె ఆరోగ్యం, మధుమేహం, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై ఫోకస్ చేస్తుంది.
నిర్ధిష్ట క్యాన్సర్ల నివారణకు మైండ్ డైట్ ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మైండ్ డైట్లో మనం తీసుకునే ఆహారం మితంగా ఉండటంపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. మైండ్ డైట్‌ను అనుసరించడంతో శరీరంలో వాపు ప్రక్రియను నివారించవచ్చు. ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్, పైటో కెమికల్స్, ఆరోగ్యకర కొవ్వులతో కూడిన ప్లాంట్ బేస్డ్ ఆహారంతో హృద్రోగాల ముప్పు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గడంతో పాటు మధుమేహం, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.
Read More :
Rakhi Festival | రేపే రాఖీ పండుగ.. వినాయక చవితిపై కూడా క్లారిటీ ఇచ్చిన బ్రాహ్మణ సేవాసమితి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

