Magnesium | ఈ ఆహారంతో మెగ్నీషియం లోపానికి చెక్
ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ ఇలా ప్లాట్‌ఫాం ఏదైనా మెగ్నీషియం (Magnesium) సంబంధించిన వీడియో కంటెంట్ విస్తారంగా కనిపిస్తుంది.
న్యూఢిల్లీ : ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, యూట్యూబ్ షార్ట్స్ ఇలా ప్లాట్‌ఫాం ఏదైనా మెగ్నీషియం (Magnesium) సంబంధించిన వీడియో కంటెంట్ విస్తారంగా కనిపిస్తుంది. మెగ్నీషియం తీసుకోవాల్సిన అవసరం, శారీరక ఆరోగ్యంలో దాని ప్రాధాన్యతపై పలువురు దృష్టి సారిస్తున్నారు. మెగ్నీషియంతో లభించే ఆరోగ్య ప్రయోజనాలు, మన శరీరానికి అది ఎందుకంత అవసరం అనే దానిపై ఆరోగ్య నిపుణులు మాట్లాడుతున్నారు.
శరీరానికి మెగ్నీషియం అత్యంత అవసరమైన మినరల్. ఇది కండరాల పనితీరు దగ్గర నుంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వరకూ ప్రతిఒక్క అవయవాన్ని, శారీరక విధులను ప్రభావితం చేస్తుంది. రక్తపోటు నియంత్రణ నుంచి ఎన్నో శరీర ధర్మాలను నిర్వర్తించడంలో మెగ్నీషియం అవసరం ఏర్పడుతుంది. కండరాలు, నరాల పనితీరుకు మెగ్నీషియం కీలకం కాగా, రోగనిరోధక వ్యవస్ధ బలోపేతానికి, గుండె లయ సవ్యంగా సాగేందుకూ అవసరం. కండరాలు బలంగా ఉండేందుకు మెగ్నీషియం సాయపడుతుంది.
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ను నియంత్రిస్తూ మెగ్నీషియం ఎనర్జీ మెటబాలిజంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. శరీరంలో తగినంత మెగ్నీషియం లెవెల్స్ ఉండేందుకు గుమ్మడి గింజలు, చియా విత్తనాలు, పాలకూర, బాదం, అవకాడో వంటి ఆహార పదార్ధాలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహరం ద్వారా మెగ్నీషియం తగినంతగా లభించని వారు వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్స్ తీసుకోవాలి. మెగ్నీషియం లోపిస్తే మధుమేహం, బీపీ, మైగ్రేన్, కుంగుబాటు వంటి పలు వ్యాధుల బారినపడే ముప్పు పొంచిఉంది.
Read More :
Sven Goran Eriksson | ‘నాకు క్యాన్సర్ ఉంది.. ఏడాది బతుకుతానంతే’ : ఇంగ్లండ్ మాజీ కోచ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- bp
- health tips
- magnesium
- Sugar
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

