Health | మీ శరీరంలో ఈ 5 మార్పులు గమనించారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి!
Health | మన ఆరోగ్యంలో ఊపిరితిత్తుల పాత్ర ప్రధానమైంది. పీల్చుకున్న ఆక్సీజన్‌ను శరీరానికి చేరవేయడంలో, శరీరంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటికి పంపడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, చాలామంది శ్వాస సమస్యల తొలి సంకేతాల్ని అంతగా గుర్తించరు.
Health | మన ఆరోగ్యంలో ఊపిరితిత్తుల పాత్ర ప్రధానమైంది. పీల్చుకున్న ఆక్సీజన్‌ను శరీరానికి చేరవేయడంలో, శరీరంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను బయటికి పంపడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అయితే, చాలామంది శ్వాస సమస్యల తొలి సంకేతాల్ని అంతగా గుర్తించరు. దీంతో రోగ నిర్ధారణ, చికిత్స వాయిదా పడతాయి. ఫలితంగా సమస్య ముదిరిపోతుంది. తొలిదశలోనే రోగాన్ని గుర్తిస్తే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. శ్వాస వ్యవస్థ ఆరోగ్యం విషయంలో ఏమాత్రం విస్మరించకూడని ఐదు హెచ్చరికలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలి. ఆ సంకేతాల్ని అర్థం చేసుకోవాలి. ఆచరణలో పెట్టాలి.
1. విడువని దగ్గు
మూడు వారాలకు మించి దీర్ఘకాలికంగా దగ్గు ఉన్నట్టయితే.. ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. అప్పుడప్పుడూ దగ్గు రావడం మామూలు విషయమే. సహజమే. కానీ విడువకుండా వెంటాడితే మాత్రం ఊపిరితిత్తుల్లో సమస్యకు హెచ్చరికగా భావించాలి. ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సూచన అయినా కావచ్చు. ఛాతీనొప్పి, శ్వాసలో ఇబ్బంది, దగ్గుతున్నప్పుడు రక్తం పడటం లాంటివాటితోపాటు దగ్గు దీర్ఘకాలికంగా ఉంటే.. సమస్య నిర్ధారణ కోసం వైద్యుల్ని కలవాల్సిందే.
2. శ్వాస తగ్గడం
శారీరక శ్రమ చేసినప్పుడు, రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా మనం తీసుకునే శ్వాస తగ్గినట్టు అనిపిస్తే ఊపిరితిత్తుల సమస్యకు అదొక హెచ్చరిక లాంటిది. శ్వాస సరిగ్గా తీసుకోకపోవడాన్ని డిస్ప్నియా అంటారు. ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ), గుండె సమస్యల కారణంగా కూడా డిస్ప్నియా తలెత్తుతుంది. ఏ కొంత పనిచేసినా, విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకుంటున్నప్పుడు గసపోస్తున్నట్టు ఉంటే నిపుణులను కలవడం మంచిది.
3. నొప్పి, పట్టేసినట్టు ఉండటం
ఛాతీనొప్పి లేదా ఛాతీ పట్టేసినట్టు ఉండటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది లోపల దాగి ఉన్న ఇతర శ్వాస సమస్యలకు సూచిక కావచ్చు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, న్యుమోనియా, ఊపిరితిత్తుల్లోని రక్త నాళాల్లో అవరోధాలు (బ్లాకేజీ) ఉండే పల్మనరీ ఎంబాలిజం మొదలైన రుగ్మతల లక్షణం కూడా కావచ్చు. కొన్నిసార్లు ఛాతీనొప్పి గుండె సమస్యలకు సంకేతమై ఉండొచ్చు. శ్వాస తగ్గడం లేదా తలతిప్పడం లాంటి ఇతర లక్షణాలతో ఛాతీలో నొప్పి విడువకుండా, లేదంటే తీవ్రంగా ఉంటే తక్షణ వైద్యం తప్పనిసరి.
4.దగ్గుతోపాటు రక్తం
దగ్గుతోపాటు రక్తం పడటాన్ని హీమోటైసిస్ అంటారు. తక్షణ వైద్యం అవసరమయ్యే తీవ్రమైన వ్యాధి లక్షణం ఇది. ఇన్ఫెక్షన్లు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, క్షయ, పల్మనరీ ఎంబాలిజం మొదలైన కారణాల వల్ల వస్తుంది. రక్తం పరిమాణం, తరచుదనంతో సంబంధం లేకుండా దగ్గుతో రక్తం పడటాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. సమగ్రమైన రోగ నిర్ధారణ కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.
5. శ్వాస ఇన్ఫెక్షన్లు మళ్లీమళ్లీ
బ్రాంకైటిస్, న్యుమోనియా లాంటివి పదేపదే రావడం ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగాలేదనడానికి సూచన. అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడిందనడానికి హెచ్చరిక కూడా. ఇలాంటి లక్షణాలు కనిపించినా, ఎక్కువ కాలం కొనసాగుతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.
…ఐదు హెచ్చరికలను గుర్తించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవన విధానం కూడా మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి రక్షగా ఉంటుంది. ధూమపానం వదిలిపెట్టడం, ఇల్లు- పరిసరాలు దుమ్మూధూళి లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యాయామం, చేతులు తరచుగా కడుక్కోవడం లాంటి అలవాట్ల ద్వారా శ్వాసకు సంబంధించిన సమస్యల ముప్పు తగ్గించుకోవచ్చు. ఏది ఏమైనా.. శ్వాసకోశ సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఒకటేదారి.. తొలిదశలోనే రుగ్మతను గుర్తించి, నాణ్యమైన చికిత్స తీసుకోవడం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

