Health tips : ఈ ఐదింటితో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు!

ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేకుండా ఎక్కువకాలం సంతోషంగా జీవించాలని కోరుకోని వారుండరు. జీవితంలో ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందంగా బతకాలనీ కోరుకుంటారు. ఆరోగ్యంపై మనం తీసుకునే శ్రద్ధ, అందుకు తీసుకునే జాగ్రత్తలే రాబోయే రోజుల్లో పరిపూర్ణ జీవితం ఆస్వాదించేలా మెరుగైన ఫలితాలు ఇస్తాయి. దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం మన చేతుల్లోనే ఉందని జర్నల్ నేచర్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. ఇక పరిపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే ఈ ఐదింటినీ అనుసరించాలని నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం : వయసు పెరిగేకొద్దీ ఎముకలు, కండరాలు, జాయింట్స్ బలహీనపడటం సహజం. శారీరక వ్యాయామంతో కండరాలు, ఎముకల పటుత్వం పెంచుకోవడం ద్వారా వయసు మీద పడటంతో తదుపరి దశలో వచ్చే కాంప్లికేషన్స్‌ను అధిగమించవచ్చు. నిత్యం కుదురుగా చేసే వర్కవుట్ ద్వారా అదనపు కొవ్వు కరగడంతో పాటు, తీరైన శరీరాకృతి కూడా పొందే వెసులుబాటు ఉంది. స్ధూలకాయం, గుండె జబ్బులు, ఇతర వ్యాధుల ముప్పును నివారించవచ్చు.

మీతో మీరు గడపండి : మీతో మీరు కనెక్ట్ అవడం దీర్ఘాయువు సాధించేందుకు కీలకం అంటారు నిపుణులు. ఎవరైతే తమ మనసు, ఆత్మ గురించి అవగాహన కలిగి ఉంటారో వారు ఎలాంటి పరిస్ధితినైనా ఆకళింపు చేసుకోగలిగి ఉంటారు. ఇది నిర్ణయాలు తీసుకునే శక్తిని మనిషికి సమకూరుస్తుంది. ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం, రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఈ స్ధితిని చేరుకోవచ్చు.

ప్రకృతి ఒడిలో సేదతీరడం : పచ్చదనం నిండిన ప్రదేశంలో ప్రకృతిని ఆస్వాదించడం ఆరోగ్యానికి మేలు చేకూర్చడమే కాకుండా మనసునూ ఆహ్లాదపరుస్తుంది.శరీరానికి తగినంత విటమిన్ డీ అందేందుకూ ఇది ఉపకరిస్తుంది. ప్రకృతితో మమేకమవడంతో ఒత్తిళ్లు దూరమై వ్యాధినిరోధక శక్తీ ఇనుమడిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సమతుల ఆహారం : ఆరోగ్యంగా జీవించేందుకు సమతుల పోషకాహారం పాత్ర అత్యంత కీలకం. శరీర పనితీరును సజావుగా సాగేందుకు అవసరమైన పోషకాలు, విటిమిన్లు, ఖనిజాలు సమపాళ్లలో అందించే ఆహారాన్ని తీసుకోవడం అలవరచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆకుకూరలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి.

శరీరం పంపే సంకేతాలపై అప్రమత్తత : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. శరీరం ఈ దిశగా పంపే సంకేతాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాల్సిన పరిస్థితి ఎదురైతే వైద్య సాయం తీసుకునేందుకు వెనుకాడవద్దు. వ్యాధుల ముప్పును నివారించేందుకు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం మేలు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

