Heart Diseases @ Lifestyle habits | గుండెజబ్బులకు దారితీసే జీవనశైలి అలవాట్లు.. జాగ్రత్తకు హెచ్చరిక సంకేతాలు..!
Heart Diseases @ Lifestyle habits | మన అలవాట్లే మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయన్నది పచ్చినిజం. కొన్ని జీవనశైలి అలవాట్లు మన గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ అలవాట్లను పక్కనపెట్టడంతోపాటు.. హెచ్చరిక సంకేతాలను గమనించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
Heart Diseases @ Lifestyle habits | మన జీవనశైలి అలవాట్లే మనకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు 55 తర్వాత కనిపించే గుండె జబ్బులు ఇప్పుడు 30 లలోనే కనిపిస్తున్నాయి. వీటికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం, అలవాట్లే అని నిపుణులు చెప్తున్నారు. గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్న 80 శాతం కంటే ఎక్కువ మంది గుండెపోటులో బాధపడుతున్నారు. కార్డియోవాస్కులర్ జబ్బులున్న రోగుల్లో మూడింట ఒక వంతు రోగులు అకాల మరణం చెందుతున్నారు. గుండె జబ్బులకు దారితీసే జీవనశైలి అలవాట్లను గుర్తెరిగి.. హెచ్చరిక సంకేతాలను గమనించడం ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడొచ్చు.
అనారోగ్యకర ఆహారం..
గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచే ప్రధాన జీవనశైలి అలవాట్లలో అనారోగ్యకరమైన ఆహారం ముఖ్యమైనది. శాచురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. అలాగే ధమనుల్లో ఫ్లేక్ వచ్చేందుకు దారితీస్తాయి. ఇది చివరికు గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారి తీస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు నిత్యం తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
శారీరక శ్రమ లేకపోవడం..
గుండె జబ్బులకు దోహదపడే మరో ముఖ్యమైన అంశం శారీరక శ్రమ లేకపోవడం. చలనం లేని జీవనశైలి బరువు పెరగడం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌కు దారితీస్తుంది. ఇవన్నీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. చురుకైన నడక, పరుగు లేదా సైక్లింగ్ వంటి సాధారణ శారీరక శ్రమ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడం ద్వారా గుండె జబ్బుల నుంచి మనల్ని కాపాడుతాయి. నిత్యం కనీసం అర్ధ గంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి.
సిగరెట్ స్కోకింగ్ చేయడం..
సిగరెట్ స్మోకింగ్ గుండె జబ్బులకు మరొక ప్రధాన ప్రమాద కారకం. పొగాకు ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు ధమనుల పొరను దెబ్బతీస్తాయి. అలాగే ఫ్లేక్స్ వచ్చేలా చేసి చివరకు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సిగరెట్ స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అలాగే, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
ఇవీ హెచ్చరిక సంకేతాలు..
హై బ్లడ్ ప్రెజర్ లేదా హైపర్‌టెన్షన్
అధిక రక్తపోటు లేదా రక్తపోటు.. గుండె జబ్బులకు ప్రధాన హెచ్చరిక సంకేతం. అధిక రక్తపోటు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగించి ధమనుల్లో ఫ్లేక్స్ తయారవడానికి దారితీస్తుంది. రెగ్యులర్ రక్తపోటు తనిఖీలు రక్తపోటును గుర్తించడంలో సహాయపడతాయి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ద్వారా గుండె జబ్బులు రాకుండా నివారించుకునేందుకు ముందస్తుగా జాగ్రత్త పడేందుకు అవకాశం కల్పిస్తుంది.
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు..
అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. మైనం వంటి పదార్థమైన కొలెస్ట్రాల్ ధమనుల్లో పేరుకుపోయి ఫ్లేక్స్ తయారయ్యేలా చేస్తంది. ఇది రక్తం సరఫరాకు అడ్డంకిగా మారి గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణ రక్త పరీక్షల ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
చివరగా..
అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం వంటి కొన్ని జీవనశైలి అలవాట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. ఛాతీ నొప్పి, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి హెచ్చరిక సంకేతాలు ఒక వ్యక్తి గుండె ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదాన్ని సూచిస్తాయి. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా, ఈ హెచ్చరిక సంకేతాలపై శ్రద్ధ చూపడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి వీలుంటుంది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

