Laughing: కారణం లేకుండానే నవ్వుతున్నారా? అది మూర్ఛ లక్షణం కావొచ్చు
అదే పనిగా నవ్వుతున్నారంటే మానసిక సమస్య ఉన్నట్టే
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే మాట వినే వింటారు. అందుకని రోజులో ఒకసారైనా గట్టిగా నవ్వితే ఆరోగ్యానికి మంచిది అంటారు డాక్టర్లు. కానీ, కొందరు ఏ కారణం లేకపోయినా నవ్వుతుంటారు. అంతేకాదు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. ఎంత ప్రయత్నించినా నవ్వకుండా ఉండలేరు. ఇలాంటివాళ్లకు మెదడు పనితీరు సరిగ్గా ఉండదు. దాంతో వీళ్లకి మానసిక సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే… అకారణంగా నవ్వడం అనేది మూర్ఛ రోగం లక్షణం అంటున్నారు డాక్టర్లు. ఈ సమస్యని ‘గెలాస్టిక్ ఎపిలెప్సీ’ అంటారు. దీన్ని యాంటీ సీజర్ మందులతో నయం చేయవచ్చు. ఈ ప్రాబ్లమ్‌ని ముందుగానే గుర్తిస్తే తొందరగా కోలుకునే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు.
హైపోథలామస్‌లో సమస్య
ఈ సమస్యతో బాధపడుతున్న ఆరేళ్ల పిల్లాడికి అపోలో హాస్పిటల్లో న్యూరాలజిస్ట్‌గా పనిచేస్తున్నసుధీర్ కుమార్ ఈమధ్యే ట్రీట్మెంట్ చేశారు. ఆ బాబు ఇప్పుడు కోలుకున్నాడు. నవ్వుకి, మూర్ఛకి సంబంధం ఉందనే విషయం గురించి ఇలా చెప్పుకొచ్చారాయన. ఆ పిల్లడు ఒక నిమిషం పాటు ఆగకుండా నవ్వడం గమనించాను. దాదాపు మూడు నెలలుగా అతను తరచూ నవ్వుతూ ఉండేవాడని తల్లిదండ్రులు చెప్పారు. అతడిని ‘ఎందుకు నవ్వుతున్నావు?’ అని అడిగితే. ‘ఏం లేదు. ఊరికే’ అని సమాధానం చెప్పాడు. అంతేకాదు అతను ఈ మూడు నెలల్లో 2 కిలోల బరువు పెరిగడమే కాకుండా చదువులోనూ వెనబడ్డాడు. అతని మెదడుని ఎంఆర్ఐ చేశాం. హైపోథలామస్‌లో ‘హమర్టోమా’ అనే సమస్య ఉండడం గమనించాం. ఇలాంటివాళ్లలో హార్మోన్లు సరిగ్గా విడుదల కావు. జ్ఞాపకశక్తి సరిగ్గా పనిచేయదు’ అని చెప్పాడు సుధీర్ కుమార్.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

