ఆ కరోనా వ్యాక్సిన్ల బూస్టర్ డోసులు సేఫ్ : లాన్సెట్ అధ్యయనం

లండన్ : ఆరు విభిన్న కొవిడ్-19 బూస్టర్ డోసులు సురక్షితమని, గతంలో ఆస్ట్రాజెనెకా లేదా ఫైజర్ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో బూస్టర్ డోసులతో రోగనిరోధక వ్యవస్ధ మెరుగ్గా ఉందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న వారు ఆరు నెలల పాటు వైరస్ తీవ్రతతో దవాఖానలో చేరడం, మరణాల నుంచి వరుసగా 79, 90 శాతం రక్షణ కలిగిఉన్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైందని పరిశోధకులు చెబుతున్నారు.
నెలలు గడుస్తున్న కొద్దీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ తగ్గుముఖం పడుతున్నట్టు గుర్తించారు. తాజా వేరియంట్ల వ్యాప్తి నేపధ్యంలో బూస్టర్ డోస్‌లుగా ఏడు వ్యాక్సిన్ల భద్రత, రోగనిరోధక వ్యవస్ధ స్పందన, సైడ్ ఎఫెక్ట్స్‌పై పరిశోధనలు జరిపారు. ఆస్ట్రాజెనెకా, ఫైజర్-బయోఎన్‌టెక్, నోవావ్యాక్స్, జాన్సన్, మోడెర్నా, వాల్నెవ, క్యూర్‌వ్యాక్ వ్యాక్సిన్లపై అధ్యయనం చేపట్టారు.
ఈ వ్యాక్సిన్లు అన్నీ మూడో డోసుగా తీసుకునేందుకు సురక్షితమని, సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కనిపించాయని పరిశోధనలో వెల్లడైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన యూనివర్సిటీ హాస్పిటల్ సౌథాంప్టన్ ప్రొఫెసర్ సౌల్ ఫాస్ట్ పేర్కొన్నారు. బూస్టర్ డోసులు తీసుకున్న మూడు నెలల నుంచి ఏడాది తర్వాత తదుపరి గణాంకాల ఆధారంగా ఫలితాలు ఉంటాయని చెప్పారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

