High cholesterol: పిల్లలు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా? అయితే జాగ్రత్త.. వారికి ఈ ముప్పు పొంచి ఉన్నట్లే!!
మీ పిల్లలు అధిక కొలెస్ట్రాల్ సమ్యతో బాధపడుతున్నారా? ఊబకాయంతో సతమతమవుతున్నారా? కాస్తదూరం నడవగానే అలసిపోతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా పెద్దవారిలో గుండె సమస్యలు గుర్తించొచ్చు. కానీ ఆశ్చర్యకరంగా అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న పిల్లలు, యుక్తవయస్కుల్లో ఇప్పుడు ఇది ఒక సాధారణ దృగ్విషయంగా మారింది. వారు వివిధ కరోనరీ ఆర్టరీ వ్యాధులు, ఇతర గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ గుండె సమస్యలకు కారణాలేంటో చూద్దాం.
మీ పిల్లలు అధిక కొలెస్ట్రాల్ సమ్యతో బాధపడుతున్నారా? ఊబకాయంతో సతమతమవుతున్నారా? కాస్తదూరం నడవగానే అలసిపోతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా పెద్దవారిలో గుండె సమస్యలు గుర్తించొచ్చు. కానీ ఆశ్చర్యకరంగా అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న పిల్లలు, యుక్తవయస్కుల్లో ఇప్పుడు ఇది ఒక సాధారణ దృగ్విషయంగా మారింది. వారు వివిధ కరోనరీ ఆర్టరీ వ్యాధులు, ఇతర గుండె సంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ గుండె సమస్యలకు కారణాలేంటో చూద్దాం.
1. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు..
రోజులో ఎప్పుడు బయటకెళ్లినా ఇష్టమొచ్చిన తినుబండారాలు తింటారు. ప్యాకేజ్డ్ ఫుడ్‌కే మొగ్గుచూపుతారు. రెస్టారెంట్లో చెడు కొవ్వు, అధిక కేలరీలు, అనారోగ్యకరమైన జంక్ ఫుడ్లను ఆర్డర్ చేస్తారు. వీటివల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
2. కుటుంబ చరిత్ర..
చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సమస్యల కారణంగా ఎక్కువ మంది పెద్దలు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఇవి వారి పిల్లలకు కూడా సంక్రమిస్తున్నాయి.
3.ఇతర రుగ్మతలు..
కిడ్నీ వ్యాధులు, మధుమేహం, థైరాయిడ్‌లాంటి ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు అధిక కొలెస్ట్రాల్‌కు గురయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా, పిల్లలు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతున్నారని సూచించే లక్షణాలు లేవు. ఎల్డీఎల్, హెచ్‌డీఎల్ (చెడు, మంచి కొలెస్ట్రాల్), ట్రైగ్లిజరైడ్ల గురించి వివరాలను అందించే కొలెస్ట్రాల్ స్థాయిలను కొలవడానికి ఒక సాధారణ రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. పిల్లలు గుండె సంబంధిత సమస్యలను కలిగి ఉంటే తొమ్మిదేళ్ల తర్వాత పై పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలి. పిల్లల్లో ఏ చిన్న గుండె సంబంధిత పరిస్థితినైనా చాలా సీరియస్‌గా తీసుకోవడం చాలా ముఖ్యం. జీవనశైలి మార్పులు తప్పనిసరి. ఈ కింది మార్పులు చేసుకోవాలి.
1. చురుకైన జీవితాన్ని గడపడం..
గత రెండేళ్లలో కొవిడ్-19 పరిమితులు, పదేపదే లాక్డౌన్ల కారణంగా పిల్లలు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటూ టీవీ, కంప్యూటర్ల ముందు ఎక్కువగా గడిపారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. వారు ఆరుబయట ఆడుకునేలా, చెమటలు పట్టేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వారి స్క్రీన్ సమయాలను పరిమితం చేయాలి. మొబైల్ ఫోన్ ఇవ్వకపోవడమే ఉత్తమం.
2. ఆరోగ్యకరమైన ఆహారం..
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ఆహారంలో చాలా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఉంటాయి. సంతృప్త కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే జంక్ ఫుడ్‌ను పరిమితం చేయాలి.
3. బరువు తగ్గడం..
పిల్లలు అధిక బరువుంటే ప్రమాదకరం. అందుకే వారు బరువు తగ్గడంపై దృష్టిపెట్టాలి. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి ఊబకాయాన్ని తనిఖీ చేస్తూ ఉండాలి. పిల్లలు తమంతట తాముగా బరువు తగ్గేందుకు ప్లాన్ చేసుకోలేరు. తల్లిదండ్రులే వారు బరువు తగ్గేలా ప్లాన్ చేయాలి. ఆరు బయ చెమట పట్టేదాకా ఆడుకునేలా చూడాలి. జంక్ ఫుడ్ మానేసి, సమతుల ఆహారం తీసుకునేలా ప్రోత్సహించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

