Health tips | ఊబకాయం మీ సమస్యా.. అయితే ఈ పది టిప్స్ మీ కోసమే.. !
Health tips | ఈ రోజుల్లో చాలామంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, తింటున్న ఆహారం కారణంగా చాలామంది బరువు పెరుగుతున్నారు. అస్సలే శారీరక శ్రమ లేకపోవడం కూడా ఇలా పెరగడానికి కారణమవుతోంది. లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం లాంటి అలవాట్లతో ఈ అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు.
Health tips : ఈ రోజుల్లో చాలామంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, తింటున్న ఆహారం కారణంగా చాలామంది బరువు పెరుగుతున్నారు. అస్సలే శారీరక శ్రమ లేకపోవడం కూడా ఇలా పెరగడానికి కారణమవుతోంది. లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం లాంటి అలవాట్లతో ఈ అధిక బరువు సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఓ పది టిప్స్‌ను తరచూ ఫాలో అవడం ద్వారా సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు.
బరువు తగ్గేందుకు చిట్కాలు
నీళ్లు బాగా తాగాలి
భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఇది ఆకలిని తగ్గించడంలో సహాయపడటమేగాక కడుపు నిండిన అనుభూతిని కూడా కలిగిస్తుంది. అందువల్ల మనం తక్కువ తినడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. నీరు శరీరమంతా పోషకాలను బదిలీ చేస్తుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడంవల్ల శరీరంలోని విషపదార్థాలు కూడా బయటికి వెళ్లిపోతాయి.
ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి
ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినాలి. ఇవి మీ కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి. అధిక ప్రొటోన్లు కలిగిన ఆహారం మిమ్మల్ని అతిగా తినకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ ప్రొటీన్ ఫుడ్ కండరాల పెరుగుదలకు చక్కటి సహాకారం అందిస్తుంది. జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పద్ధతిగా తినండి..
మీరు తినే ప్రతి పదార్థంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఇష్టమైన ఫుడ్‌ను ఆస్వాదించడం తప్పులేదు. కానీ అతిగా తినకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆకలితో ఉన్నపుడు ఎలాంటి ఫుడ్ తినాలనే విషయంలో అవగాహన పెంచుకోవాలి. అలా చేయడంవల్ల అతిగా తినకుండా జాగ్రత్తపడవచ్చు.
తగినంత నిద్ర అవసరం
సరైన నిద్ర లేకపోవడంవల్ల హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది అతిగా తినడానికి దారితీస్తుంది. ప్రతిరోజు సంపూర్ణమైన నిద్ర ఆరోగ్యంగా ఉంచడంతోపాటు సులభంగా బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది.
ఫాస్ట్ ఫుడ్స్ వద్దు
ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. వాటిలో శరీరానికి అవసరమైన పోషకాలు ఉండవు. అధికంగా చక్కెరలు ఉంటాయి. దాంతో బరువు పెరగటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బరువు తగ్గించుకోవడానికి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
నిత్య వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంవల్ల మన శరీరానికి కావాల్సిన కేలరీలు అందుతాయి. వ్యాయామం జీవక్రియను, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్‌ను తగ్గించునేందుకు నడక, యోగా, ఆటలు తోడ్పడుతాయి.
హెల్తీ స్నాక్స్
ఆకలి బాగా ఉన్నప్పుడు అధిక పోషకాలున్న స్నాక్స్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను అందించే పండ్లు, కూరగాయలు, గింజలు లాంటి స్నాక్స్‌ను ఎంచుకోవాలి.
మొబైల్ యాప్..
ఆరోగ్యకరమైన ఆహారాలు, జూస్ లు తదితర విషయాల గురించిన సలహాల కోసం మొబైల్ యాప్‌ను ఉపయోగించాలి. అందువల్ల ఆహారపు అలవాట్లపై అవగాహన పెరుగుతుంది. శారీరక ఎదుగుదల కోసం మంచి ఫుడ్ ను ఎంచుకునేందుకు సాయపడుతుంది. బరువు తగ్గడానికి బాడీకి కావాల్సిన కేలరీలను అందించడంలో ఫుడ్ యాప్స్ మేలు చేస్తాయి.
కేలరీలను కంట్రోల్ చేయండి
మీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు తినే ముందు చిన్న ప్లేట్లను ఉపయోగించండి. ప్రతి పూటకు కొలతలు పెట్టుకోవాలి. ఇలా చేయడంవల్ల అధిక బరువును సులభంగా నియంత్రించవచ్చు.
ఒత్తిడిని తగ్గించుకోండి
దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోన్స్, ఆకలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు అతిగా తినడం బరువు పెరగడానికి దారితీస్తుంది. ఒత్తిడి అనిపించినప్పుడు ధ్యానం, యోగా, వ్యాయామం లేదంటే ఏదైనా మీకిష్టమైన పని మీదకు మీ మనసును మళ్లించండి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

