Daily One Egg | నిత్యం కోడిగుడ్డు తినడం మన ఆరోగ్యానికి మంచిదేనా..?
Daily One Egg | కోడి గుడ్డు ద్వారా మనకు అనేక పోషకాలు అందుతాయి. గుడ్లను ఉడకబెట్టినా, గిలకొట్టినా.. అవి ఎప్పుడూ మనకు ఆరోగ్యంతో పాటు ఆనందాన్నిస్తాయి. ఒక కోడిగుడ్డు కంటే ఎక్కువ తినడం మంచిదేనా..?
Daily One Egg | కోడి గుడ్డు ద్వారా మనకు అనేక పోషకాలు అందుతాయి. గుడ్లను ఉడకబెట్టినా, గిలకొట్టినా.. అవి ఎప్పుడూ మనకు ఆరోగ్యంతో పాటు ఆనందాన్నిస్తాయి. గుడ్లలో మన శరీరానికి కావల్సిన శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్‌తోపాటు పొటాషియం, విటమిన్ ఏ, డీ, బీ6, బీ 12, కాల్షియం, ఐరన్, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. శరీరానికి శక్తి కావాల్సి వచ్చినప్పుడు కోడిగుడ్డు తినమని వైద్యులు సూచిస్తుంటారు. గుడ్లు గుండె నుంచి కళ్ల వరకు అన్ని అవయవాలను కాపాడుతాయి. మరి ఒక కోడిగుడ్డు కంటే ఎక్కువ తినడం మంచిదేనా..? ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా..? అనే సందేహాలు కూడా చాలా మంది మదిని తొలుస్తున్నాయి.
ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు రెండు గుడ్లు తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాలను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోజూ గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన మానవుడు నిత్యం 2 గుడ్లు తినవచ్చని వివిధ పరిశోధనలు సెలవిస్తున్నాయి.
గుడ్డు ప్రోటీన్, కొవ్వు రెండింటి కలయికతో కూడిన శక్తివంతమైన ఆహారం. వీటిని రోజూ తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకోక శరీరం బరువు తగ్గించుకుంటారు. గుడ్డును అల్పాహారంలో తినడం చాలా మంచిది. జీవక్రియకు మద్దతుగా నిలుస్తుంది.
గుడ్డులో లభించే విటమిన్ ఏ కంటి దోషాలను నివారిస్తుంది. రోజూ గుడ్డు తినేవారికి ఐ సైట్, శుక్లాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే గుడ్డులో ఉండే విటమిన్ డీ, సల్ఫర్ గోళ్ల ఆరోగ్యానికి సహకరిస్తుంది.
గుడ్డు సొనలో 300 మైక్రోగ్రాముల కోలిన్ అనే పోషక పదార్థం ఉండి మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడులో సమాచారం చేరవేయడంలో కోలిన్ పాత్ర ముఖ్యమైనది. విటమిన్ ఏ, కెరోటిన్ ద్వారా లూమీప్లేమిన్, లూమీక్రోమిన్ అనే యాంటి యాక్సిడెంట్లు ద్వారా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను నివారించొచ్చు. గుడ్డు నిత్యం తినడం వల్ల పురుషుల్లో మేల్ హార్మోన్స్ టెస్టోస్టిరాల్ లెవల్స్ పెరుగుతాయి.
రోజును ప్రారంభించడానికి తగినంత శక్తిని అందించే చవకైన ఆహారాల్లో గుడ్డు ఒకటి. సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. గుడ్డు పచ్చసొనలో ఉండే డీ విటమిన్.. సాధారణ జలుబు, ఫ్లూ నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన వివిధ ఖనిజాలు, విటమిన్లను కలిగి ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పరిమితికి మించి తినడం వల్ల..
పచ్చసొన ద్వారా ఏర్పడే కొలెస్ట్రాల్ గుండెకు ప్రమాదకరం
రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
ఇన్సులిన్ అస్థిరంగా మారుతుంది.
ఊబకాయం పెరిగే ప్రమాదం ఉంది.
అందుకని డైట్లో గుడ్లను ఖచ్చితంగా తీసుకునేవారు రోజుకి రెండు గుడ్లు మాత్రమే తీసుకునేలా జాగ్రత్తపడాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవని గుర్తుంచుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

