న్యూఢిల్లీ : దేశీ వంటకాలకు రుచిని ఆపాదించే పన్నీర్ (Health Tips) అంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టపడతారు. ఇక పోషక విలువల పరంగా పన్నీర్లో అధిక ప్రొటీన్ , క్యాల్షియం, ఫాస్పరస్‌తో పాటు బీ12, విటమిన్ ఏ వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే పన్నీర్లో పోషక విలువలు మెండుగా ఉన్నా అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండటంతో పరిమిత మోతాదులోనే తీసుకోవాలి.
ముఖ్యంగా హృద్రోగ ముప్పు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు పన్నీర్‌ను మితంగా తీసుకోవాలి. ఇక పన్నీర్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు ఇతర పోషకాలు అధికంగా ఉన్న ఆహారాలతో పాటు తీసుకుంటే శరీరానికి సమతులాహారం అందుతుంది.
ఇక శాకాహారులు పన్నీర్ మెరుగైన ప్రొటీన్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. కండరాల వృద్ధి, రిపేర్‌కు పన్నీర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఇక నిత్యం పన్నీర్ తీసుకోవడం వల్ల చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను చూస్తే..
అధిక ప్రొటీన్
విటమిన్లు, మినరల్స్ పుష్కలం
బరువు తగ్గుదల
జీవక్రియల వేగం పెంపు
కండరాల వృద్ధి
శక్తినిచ్చే ఆహారం
హృదయం పదిలం
ఎముకల బలోపేతం
మధుమేహ నియంత్రణ
ఆరోగ్యానికి మేలు
Read More :