Health Tips | శ్వాసపై ధ్యాసతో ఒత్తిడికి చెక్!
మనల్ని సజీవంగా ఉంచడంలో శ్వాసించడం ఎంతో కీలకం. అందుకే శ్వాసను సంస్కృతంలో ప్రాణ్‌గా పిలుస్తారు. శ్వాస వ్యాయామాలను ప్రాణాయామంగా వ్యవహరించడంలోనే అది మన జీవితాన్ని పొడిగిస్తుందనే అర్ధం దాగుందని నిపుణులు చెబుతుంటారు.
న్యూఢిల్లీ : మనల్ని సజీవంగా ఉంచడంలో శ్వాసించడం ఎంతో కీలకం. అందుకే శ్వాసను సంస్కృతంలో ప్రాణ్‌గా పిలుస్తారు. శ్వాస వ్యాయామాలను ప్రాణాయామంగా వ్యవహరించడంలోనే అది మన జీవితాన్ని పొడిగిస్తుందనే అర్ధం దాగుందని నిపుణులు చెబుతుంటారు.
మన స్ట్రెస్ లెవెల్స్‌తో శ్వాస నేరుగా సంబంధం కలిగిఉంటుందని శ్వాసపై ధ్యాసతో ఒత్తిడిని దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడికి లోనైనప్పుడు గాఢంగా శ్వాస తీసుకునే ఎక్సర్‌సైజ్‌లతో స్ట్రెస్ తగ్గి మనసు, శరీరం తేలికపడే సందర్భాలను చూస్తుంటాం. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో ఒత్తిడిని చిత్తు చేయడంతో పాటు మెరుగైన ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు.
పొత్తికడుపు నుంచి శ్వాస తీసుకోవడం : పొత్తి కడుపు నుంచి శ్వాస తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. శిశువు శ్వాసించే విధానాన్ని పరిశీలించాలి. శిశువు శ్వాస తీసుకునేటప్పుడు తన కడుపు కండరాలను గట్టిగా బిగించకుండా ఛాతీ, పొత్తికడుపు మధ్య ఒక లయతో సులభంగా పూర్తి శ్వాసలను తీసుకుంటుంది.
శ్వాసపై ధ్యాస : ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసేందుకు మెల్లిగా, శ్వాసపై ధ్యాసపెడుతూ గాఢమైన శ్వాస తీసుకోవాలి. ఈ క్రమంలో మీ మెదడు శ్వాస ప్రక్రియపైనే ధ్యాసను నిలిపిఉంచేలా చూసుకోవాలి. మీ మనసును కలవరపరిచే విషయాలను పక్కనపెట్టేలా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడిని చిత్తు చేయవచ్చు.
యోగా : మనసు, శరీరం విశ్రాంతి పొందడం ద్వారా రోజంతా చలాకీగా ఉండేందుకు యోగా తోడ్పడుతుంది. ప్రతి ఆసనం శ్వాసను ఆధారం చేసుకుని ఉండటంతో మనసు, శరీరం తేలికపడుతుంది. ప్రాణాయామంతో మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుంది.
4:7:8 బ్రీతింగ్ : ఈ ప్రక్రియలో భాగంగా నాలుగు సెకండ్ల పాటు శ్వాస తీసుకుని, ఏడు సెకండ్ల పాటు దాన్ని నిలిపి ఉంచి ఆపై ఎనిమిది సెకండ్లలో గాలిని బయటకు వదలడం చేయాలి. ఈ ప్రక్రియను ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒత్తిడి మటుమాయమై తిరిగి మీ రోజువారీ పనులపై మెరుగ్గా దృష్టి కేంద్రీకరించవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- anxiety
- breath
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

