న్యూఢిల్లీ : గుండె పోట్లు, స్ట్రోక్, హృద్రోగ మరణాలు ఆందోళనకరంగా పెరుగుతున్న సమయంలో హై కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్ వంటి జీవనశైలి రుగ్మతలను నియంత్రించడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అదిక కొలెస్ట్రాల్‌ను నిర్లక్ష్యం చేస్తే గుండె పోటుకు దారితీసే ప్రమాదం ఉందని 90 శాతం హై కొలెస్ట్రాల్ కేసులను సహజమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులతో సరిచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఈ చిట్కాలను పాటిస్తూ అధిక కొలెస్ట్రాల్‌ను ఇంటి నుంచే రివర్స్ చేయవచ్చని సూచిస్తున్నారు. శరీరంలో వాపు ప్రక్రియ, అధిక కొవ్వు కారణంగా రక్తనాళాల్లో పూడికలకు సంకేతంగా భారీ పొట్ట, ఊబకాయాలను పరిగణించి వీటి నివారణపై ఫోకస్ పెట్టాలి. బెల్లీ ఫ్యాట్, ఊబకాయాన్నితగ్గించకుండా దీర్ఘకాలంగా వదిలివేస్తే అది దీర్ఘకాలంలో తీవ్ర హృద్రోగాలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఈ ఐదు చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
బెల్లీ ఫ్యాట్‌ను వదిలించుకోవడం
పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం
ధూమపానానికి దూరమవడం
నిత్యం వ్యాయామం
సంతృప్త కొవ్వు పదార్దాలకు దూరం