IVF | ఐవీఎఫ్ కోసం యత్నిస్తున్న దంపతులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
సంతానలేమి సమస్యలు ప్రస్తుతం అనేక దంపతులను ప్రభావితం చేస్తున్నాయి. కారణాన్ని బట్టి చికిత్స కూడా మారుతూ ఉంటుంది. కొందరికి మందులు లేదా చిన్నపాటి వైద్య విధానాలు సరిపోతే, మరికొందరికి ఐవీఎఫ్ (IVF) వంటి అధునాతన సంతానోత్పత్తి చికిత్స అవసరం అవుతోంది.
IVF | సంతానలేమి సమస్యలు ప్రస్తుతం అనేక దంపతులను ప్రభావితం చేస్తున్నాయి. కారణాన్ని బట్టి చికిత్స కూడా మారుతూ ఉంటుంది. కొందరికి మందులు లేదా చిన్నపాటి వైద్య విధానాలు సరిపోతే, మరికొందరికి ఐవీఎఫ్ (IVF) వంటి అధునాతన సంతానోత్పత్తి చికిత్స అవసరం అవుతోంది. అందుకే ఐవీఎఫ్ క్లినిక్‌ను ఎంపిక చేసే ముందు కొన్ని కీలక విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొదటగా క్లినిక్‌లో పనిచేస్తున్న ఫెర్టిలిటీ నిపుణుల అనుభవం, ఎంబ్రియాలజిస్టుల నైపుణ్యం, ఇతర సిబ్బంది సామర్థ్యం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా క్లిష్టమైన కేసులను నిర్వహించడంలో అనుభవం ఉన్న వైద్య బృందం ఉండటం విజయవంతమైన చికిత్సకు కీలకంగా ఉంటుంది.
ల్యాబ్ అత్యంత కీలకం..
ఐవీఎఫ్ చికిత్సలో ప్రయోగశాల (ల్యాబ్) అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అండం, వీర్యకణాల ఫలదీకరణ, ఎంబ్రియో పెంపకం, ఉత్తమ ఎంబ్రియో ఎంపిక వంటి ప్రక్రియలు ఇక్కడే జరుగుతాయి. అందువల్ల ల్యాబ్‌లో నాణ్యత ప్రమాణాలు, భద్రతా విధానాలు, గుర్తింపు (అక్రెడిటేషన్), గాలి నాణ్యత నియంత్రణ, ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎంబ్రియాలజీ బృందం నైపుణ్యం వంటి అంశాల గురించి తెలుసుకోవడం అవసరం. మంచి నాణ్యత కలిగిన ల్యాబ్ చికిత్స విజయావకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చికిత్స ఖర్చుల విషయంలో కూడా పూర్తి పారదర్శకత ఉండాలి. కన్సల్టేషన్, పరీక్షలు, మందులు, వైద్య విధానాలు వంటి ప్రతి అంశానికి సంబంధించిన ఖర్చులను ముందుగానే వివరంగా అడిగి తెలుసుకోవాలి. చికిత్స మధ్యలో అదనపు ఖర్చులు వచ్చే అవకాశాల గురించి కూడా స్పష్టత తీసుకోవాలి. అలాగే ఈఎంఐ వంటి చెల్లింపు సౌకర్యాలు, ఆర్థిక సలహాలు అందిస్తున్నారా అనే విషయాన్ని కూడా పరిశీలించాలి.
అందరికీ ఒకేలా ఉండవు..
క్లినిక్ విజయశాతం (సక్సెస్ రేట్) గురించి తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అయితే ప్రతి ఒక్కరికీ ఫలితాలు ఒకేలా ఉండవు. వయసు, ఆరోగ్య పరిస్థితి, సంతానలేమికి కారణం వంటి అంశాలపై విజయశాతం ఆధారపడి ఉంటుంది. కాబట్టి తమ వయసు, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా క్లినిక్‌లో నమోదైన విజయశాతంపై వివరాలు తెలుసుకోవాలి. మంచి ఫెర్టిలిటీ క్లినిక్ ఐవీఎఫ్తోపాటు అవసరమైన నిర్ధారణ పరీక్షలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స ప్రణాళికను అందించాలి. అలాగే ఐయూఐ (IUI), ఐసీఎస్ఐ (ICSI), ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, డోనర్ ప్రోగ్రామ్‌లు వంటి ఇతర చికిత్సా ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయా లేదా అనేది పరిశీలించడం మంచిది. దీంతో అవసరానికి అనుగుణంగా సరైన చికిత్సను ఎంచుకునే అవకాశం ఉంటుంది. సంతానలేమి చికిత్స అంటే శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఒత్తిడిని కలిగించే ప్రయాణం. అందువల్ల క్లినిక్‌లో కౌన్సెలింగ్, భావోద్వేగ సహాయ సేవలు అందుబాటులో ఉన్నాయా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇటువంటి సేవలు దంపతులు చికిత్స సమయంలో మానసికంగా ధైర్యంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

