Health tips | ఇది తెలిస్తే మీరు రోజూ తప్పకుండా చద్దన్నం తింటారు..!
Health tips | చాలామందికి చద్దన్నం అంటే ఇష్టముండదు. కొందరైతే చద్దన్నం అనే మాట వింటేనే వాక్ అంటారు. కానీ ఒక్కసారి చద్దన్నంవల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారంటే ఇకపై చద్దన్నం వద్దు అనే మాట మీ నోట రానే రాదు. రాత్రి మిగిలిన అన్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున తినడం మాత్రమే కాదు.. రాత్రికి మిగలేలా అన్నం వండుకుని మరీ ఉదయాన్నే చద్దన్నం తింటారు. చద్దన్నంలో అంత గొప్ప తనం ఏముంది అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం..
Health tips : చాలామందికి చద్దన్నం అంటే ఇష్టముండదు. కొందరైతే చద్దన్నం అనే మాట వింటేనే వాక్ అంటారు. కానీ ఒక్కసారి చద్దన్నంవల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారంటే ఇకపై చద్దన్నం వద్దు అనే మాట మీ నోట రానే రాదు. రాత్రి మిగిలిన అన్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున తినడం మాత్రమే కాదు.. రాత్రికి మిగలేలా అన్నం వండుకుని మరీ ఉదయాన్నే చద్దన్నం తింటారు. చద్దన్నంలో అంత గొప్ప తనం ఏముంది అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్దాం..
చద్దన్నంతో ఎన్ని లాభాలుంటాయో ఇటీవల అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడైంది. ఆ అధ్యయనం ప్రకారం.. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్, కాల్షియం లాంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. అందుకే చద్దన్నంలో ఆ పోషకాల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి అది 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. అందుకే చద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్‌గా ఉంటుంది.
అంతేకాదు చద్దన్నంతో శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభిస్తుంది. ఒంట్లో వేడి చేయడం కారణంగా మన బాడీలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది. తరచూ చద్దన్నం తినడంవల్ల ఫైబర్ కంటెంట్ పెరిగి మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా రక్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది. అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు కూడా చద్దన్నం మంచి పౌష్టికాహారం.
ఈ చద్దన్నం సన్నగా ఉన్నవాళ్లు లావయ్యేందుకు, లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు కూడా తోడ్పడుతుంది. లావు తగ్గాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని రాత్రే చల్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి. రోజూ ఇలా చేయడంవల్ల స్థూలకాయులు క్రమంగా లావు తగ్గుతారు. అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారేసరికే తోడన్నం తయారవుతుంది. నిత్యం ఈ తోడన్నం తినడంవల్ల సన్నగా ఉన్నవాళ్లు క్రమంగా ఒళ్లు చేస్తారు. ఇలా పాలతో తోడేసిన అన్నాన్ని గానీ, చల్లలో నానబెట్టిన అన్నాన్నిగానీ నేరుగా తినబుద్దికాకపోతే వాటికి ఉల్లిముక్కలు, టమాటా, క్యారెట్ లాంటివి కలుzపుకుని తాలింపు పెట్టుకుని కూడా లాగించొచ్చు.
గమనిక : అయితే, ఇలా చేసి పెట్టుకున్న చద్దన్నాన్ని తప్పనిసరిగా ఉదయాన్నే తినాలి. మరింత ఆలస్యం చేస్తే అది ఎక్కువగా పులిసి విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి ఆహారం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

