Honey | అధిక వేడి తగిలేలా తేనెను ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..
తేనె ఆరోగ్యానికి మంచిదనే భావన చాలా మందిలో ఉంది. సహజమైన మధుర పదార్థంగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే తేనెను ఎలా ఉపయోగిస్తామన్నదే దాని ప్రయోజనాలను నిర్ణయిస్తుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Honey | తేనె ఆరోగ్యానికి మంచిదనే భావన చాలా మందిలో ఉంది. సహజమైన మధుర పదార్థంగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే తేనెను ఎలా ఉపయోగిస్తామన్నదే దాని ప్రయోజనాలను నిర్ణయిస్తుందని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తేనె సాధారణంగా సురక్షితమైన ఆహార పదార్థమే. శతాబ్దాలుగా దీన్ని ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. కానీ దీనిని వేడి చేసే విధానం, నిల్వ చేసే విధానం వంటి అంశాలు దాని పోషక విలువలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక వేడికి గురికావద్దు..
తేనెను మోస్తరు ఉష్ణోగ్రత వద్ద వాడడం పెద్ద సమస్య కాదు. సాధారణ వంటకాలలో లేదా గోరువెచ్చని పదార్థాల్లో కలిపితే హానికరం కాదు. కానీ అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే సమస్యలు మొదలవుతాయి. అధిక వేడి వల్ల తేనెలో ఉండే సహజ ఎంజైమ్స్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు క్రమంగా నశించిపోతాయి. సుమారు 40 డిగ్రీల సెల్సియస్కి పైగా ఉష్ణోగ్రతలకు తేనెను గురి చేస్తే థర్మల్ డీగ్రడేషన్ అనే ప్రక్రియ ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే తేనె నిర్మాణం మారి, దాని గుణాత్మక విలువ తగ్గిపోతుంది. ఫలితంగా రుచి, వాసన, రంగు కూడా మారే అవకాశం ఉంటుంది.
సరిగ్గా ఉపయోగించాలి..
అందువల్ల తేనెను సరిగ్గా ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. తేనెను సరిగ్గా వాడడానికి కొన్ని సులభమైన సూచనలను కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. మరిగిన నీటిలో కాకుండా గోరువెచ్చని నీటిలో తేనె కలపడం మంచిది. వంట పూర్తయ్యాక ఆహారంపై తేనెను జోడించడం ఉత్తమం. అలాగే తేనెను మళ్లీ మళ్లీ వేడి చేయడం నివారించాలి. వంటలో ప్రధాన పదార్థంగా కాకుండా చివర్లో జోడించే పదార్థంగా వాడితే దాని ప్రయోజనాలు మెరుగ్గా లభిస్తాయి. తేనె హానికరం కాదు. కానీ దాన్ని ఎలా వాడుతున్నామన్నదే కీలకం. సరైన విధంగా ఉపయోగిస్తేనే దాని సహజ ప్రయోజనాలను పూర్తిగా పొందగలమని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Honey
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

