మరో మార్గమూ ఉంది!
కొందరిలో చనుమొన రొమ్ముల్లోకి పూర్తిగా చొచ్చుకుపోయి.. ఆ ప్రదేశంలో చిన్నపాటి గుంతలా కనిపిస్తుంది. అలాంటప్పుడు స్తన వ్యాయామంతో కొంతమేర సమస్య పరిష్కారం అవుతుంది.
డాక్టర్ గారూ.. నేను గర్భిణిని. మీరు గతవారం చెప్పినట్టుగా స్తన వ్యాయామం చేసినా, నా చనుమొన బయటికి రాలేదు. ఇంకేదైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు?
- ఒక సోదరి
కొందరిలో చనుమొన రొమ్ముల్లోకి పూర్తిగా చొచ్చుకుపోయి.. ఆ ప్రదేశంలో చిన్నపాటి గుంతలా కనిపిస్తుంది. అలాంటప్పుడు స్తన వ్యాయామంతో కొంతమేర సమస్య పరిష్కారం అవుతుంది. అయినా ఇబ్బంది తీరకపోతే ‘నిపిల్షీల్డ్’ అనే పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఇది సాసర్ ఆకారంలో ఉంటుంది. మధ్యలో రంధ్రం ఏర్పాటుచేసి ఉంటారు. ఈ రంధ్రాన్ని చనుమొనపై వచ్చేలా రొమ్ముపై ఉంచి బిగుతైన బ్రా ధరించాలి. దీనివల్ల ఎరియోలా చుట్టూ ఒత్తిడి కలిగి చనుమొన బయటికి వచ్చేసి.. నిపిల్షీల్డ్లోని రంధ్రంలోకి వెళ్తుంది. దీన్ని గర్భధారణ మధ్యదశ నుంచి వాడాలి. మొదట్లో ఒకటి రెండు గంటలు ధరిస్తూ.. క్రమంగా రోజంతా వాడాలి.
గర్భధారణ సమయంలో చనుమొన కొంత మొద్దుబారి ఉంటుంది. దీంతో నొప్పిగా అనిపించదు. ఒకవేళ నొప్పిపుడితే కాసేపు తీసివేయవచ్చు. డిస్పోజబుల్ సిరంజ్‌తో చేసే ఇన్వైర్టెట్ నిపిల్ వైద్యం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.10 మి.లీ. ప్లాస్టిక్ డిస్పోజబుల్ సిరంజ్ ముందు భాగాన్ని బ్లేడుతో కోసిన తర్వాత పిస్టన్ను తీసేసి.. కోసిన వైపు రంధ్రంగుండా బయటి గొట్టంలోకి దూర్చాలి. సిరంజ్‌లోకి ప్రవేశించేలా.. గాలి దూరకుండా రొమ్ముపై ఉంచి, పిస్టన్ను కొంత బయటికి లాగి, ఒక నిమిషం పాటు ఉంచాలి. దీనివల్ల చనుమొన పొడవు పెరుగుతుంది. ఆ తరువాత సిరంజ్ తీసి శిశువుకు పాలు తాగించవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

