Bones Weakness | మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే మీ ఎముకలు బలహీనంగా మారి విరిగిపోతాయి జాగ్రత్త..!
వయస్సు మీద పడే కొద్దీ ఎవరికైనా సరే సహజంగానే ఎముకలు పటుత్వాన్ని కోల్పోయి బలహీనంగా మారుతాయి. శరీరంలో క్యాల్షియం తగ్గడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల ఇలా ఎముకలు బలం కోల్పోతాయి.
Bones Weakness | వయస్సు మీద పడే కొద్దీ ఎవరికైనా సరే సహజంగానే ఎముకలు పటుత్వాన్ని కోల్పోయి బలహీనంగా మారుతాయి. శరీరంలో క్యాల్షియం తగ్గడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల ఇలా ఎముకలు బలం కోల్పోతాయి. వృద్ధాప్యంలో ఎవరికైనా ఇలాగే జరుగుతుంది. అయితే ప్రస్తుతం చాలా మందికి యుక్త వయస్సులోనే ఎముకలు బలహీనంగా మారి విరిగిపోతున్నాయి. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయి పెళుసుగా మారుతున్నాయి. దీంతో శక్తి లేనట్లు ఫీలవుతున్నారు. బలంగా ఉండడం లేదు. చిన్నారుల్లో కూడా ఎదుగుదల సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలా యుక్త వయస్సులోనే ఎముకలు బలహీనంగా మారకూడదు. అలా మారుతున్నాయంటే అందుకు చాలా బలమైన కారణాలే ఉంటాయి. ముఖ్యంగా కొందరు పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్లే ఎముకలు అలా బలహీనంగా మారుతుంటాయి. కనుక పొరపాట్లు ఎలా, ఎక్కడ చేస్తున్నారో గమనించాల్సి ఉంటుంది.
పొగ తాగడం..
చాలా మంది ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు సైతం పొగ అధికంగా తాగుతున్నారు. స్మోకింగ్ అనేది యువతలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. తమ తోటి స్నేహితులు తాగుతున్నారని తాము కూడా పొగ తాగడం మొదలు పెడుతున్నారు. ఇలా వారు పొగ తాగడం వల్ల శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరానికి అత్యంత హాని చేస్తాయి. క్యాల్షియం నిల్వలను తగ్గిస్తాయి. ఎముకలు బలహీనంగా మారేలా చేస్తాయి. దీంతో ఎముకల సాంద్రత సైతం తగ్గిపోతుంది. చివరకు ఎముకలు బలహీనంగా మారుతాయి. కనుక పొగ తాగడం మానేయాలి. యుక్త వయస్సులోని వారే కాదు, అసలు ఎవరూ కూడా పొగ తాగడం మంచిది కాదు. అది ఎముకలకు తీవ్రమైన హాని కలగజేస్తుంది.
అధికంగా మద్యం సేవించడం..
ప్రస్తుతం చాలా మంది కూర్చుని చేసే ఉద్యోగాలనే అధికంగా చేస్తున్నారు. రోజూ గంటల తరబడి కుర్చీల్లో కూర్చునే ఉంటున్నారు. దీని వల్ల శారీరక శ్రమ తగ్గుతోంది. ఫలితంగా ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. కనుక ఇలాంటి వారు రోజూ శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే వాకింగ్ చేయాలి. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారకుండా ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా ఉంటారు. ఇక రోజూ విపరీతంగా మద్యం సేవిస్తున్నా కూడా శరీరానికి మంచిది కాదు. ముఖ్యంగా దీని వల్ల ఎముకలపై ప్రభావం పడుతుంది. దీంతో క్యాల్షియం నిల్వలు తగ్గి ఎముకలు బలహీనంగా మరి సులభంగా విరిగిపోయే అవకాశాలు పెరుగుతాయి. అతిగా మద్యం సేవించే చాలా మంది చిన్న యాక్సిడెంట్ తరువాత ఎముకలు విరిగితే హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నప్పటికీ కొంతకాలానికి ప్రాణాంతకంగా మారి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక మద్యం అతిగా సేవించకూడదు.
ఉప్పు అధికంగా తినడం..
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను చాలా మంది అధికంగా తింటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, యువత ఇలాంటి ఆహారాలను అధికంగా తింటున్నారు. కనుక వారిలో ఎముకలు బలహీనంగా మారి సులభంగా విరిగిపోతున్నాయి. కనుక ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు తీసుకోవడాన్ని తగ్గించాలి. లేదా పూర్తిగా మానేసి ప్రత్యామ్నాయ ఆహారాలను తీసుకోవాలి. దీని వల్ల ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే చాలా మంది ఎముకల బలం కోసం క్యాల్షియం ఉండే ఆహారాలను తరచూ తీసుకుంటారు. కానీ దీంతోపాటు మన ఎముకల ఆరోగ్యానికి విటమిన్లు డి, కె కూడా అవసరమే. కనుక ఈ విటమిన్లు ఉండే ఆహారాలను తీసుకుంటేనే మన ఎముకలకు మేలు జరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా దృఢంగా ఉంటాయి. సులభంగా విరిగిపోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇలా ఆయా పొరపాట్లు జరగకుండా చూసుకుంటే ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Bones health
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

