Low BP | మనం ఏదైనా ఆరోగ్య సమస్యతో దవాఖానకు వెళ్లగానే ముందుగా మనకు రక్తపోటు చెక్ చేస్తుంటారు. నిజమే కదూ..! అంటే మన శరీర అవయవాలకు రక్తం సరఫరా ఎలా జరుగుతుందనేది తెలుసుకుంటారు. రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఆరోగ్యంగా లేకపోతే రక్తం సరఫరాపై ఒత్తిడి పెరుగుతుంది. దీనినే బ్లడ్ ప్రెజర్ అంటుంటాం. అంటే శరీరంలో సరిపడా రక్తం లేదని అర్థం చేసుకోవాలి. బ్లడ్ ప్రెజర్.. లోబీపీ, హైబీపీగా ఉంటాయి. ఈ రెండూ మనల్ని ఇబ్బందిపెడతాయి.
నార్మల్ బీపీ అంటే వ్యక్తుల సిస్టోలిక్ ప్రెజర్ 90 mm Hg కంటే ఎక్కువ, 120 mm Hg కంటే తక్కువగా ఉండాలి. డయాస్టోలిక్ ప్రెజర్ 60 mm Hg కంటే ఎక్కువ, 80 mm Hg కంటే తక్కువ ఉండాలి. పెద్దలకు నార్మల్ బీపీ రీడింగ్ 120/80 mm Hg కంటే తక్కువగా, 90/60 mm Hg కంటే ఎక్కువగా ఉండాలి. డయాస్టోలిక్ ప్రెజర్ 95 mm Hg, సిస్టోలిక్ 140 mm Hg మించకూడదు. అయితే, మహిళల్లో 60/100 , పురుషుల్లో 70/110 కంటే తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్టుగా అనుమానించాలి.
లోబీపీ కారణాలు..
గుండెలో సమస్యలు, ఎక్కువగా రక్తం కోల్పోవడం, సీవియర్ ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్, పోషకాహార లోపం, సెప్టిక్ షాక్, ఎండోక్రైన్ వ్యవస్థలో సమస్యల కారణంగా లోబీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
లోబీపీ లక్షణాలు..
లోబీపీతో ప్రమాదాలు..
లోబీపీ కంట్రోలింగ్ ఇలా..
చివరగా, లోబీపీని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఒక్కోసారి ఇది ప్రాణాల మీదకు తెస్తుందని గ్రహించాలి. ముఖ్యంగా మహిళలు దీని భారిన ఎక్కువగా పడుతుంటారు. అందుకని లోబీపీని అశ్రద్ధ చేయకుండా వైద్యం తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.