న్యూఢిల్లీ : దీపాల కాంతులు, పటాకుల మోతతో వెలుగుల పండగ దివాళీని ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. ఇష్టమైన వంటకాల నుంచి పానీయాల వరకూ ఆత్మీయులతో కలిసి ప్రజలు ఆస్వాదించారు. ఆపై బాణాసంచా మోతతో పండగను హోరెత్తించారు. ఇక చాలా మంది దివాళీ పార్టీ అనంతరం హ్యాంగోవర్‌తో పాటు కడుపుబ్బరం, అజీర్తి, మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలతో (Health Tips) బాధపడుతుంటారు. అయితే ఇంటి చిట్కాలతో ఈ ఇబ్బందులను సులభంగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అల్లం జ్యూస్‌తో హ్యాంగోవర్‌కు సహజసిద్ధంగా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. దేశంలో దశాబ్ధాల నుంచి సంప్రదాయ వైద్య పద్ధతుల్లో అల్లం కీలకంగా పనిచేస్తోంది. అల్లంలో ఉండే అత్యవసర పోషకాలు, యాంటిఆక్సిడెంట్లు, వాపు నివారణ పదార్దాలు, యాంటీసెప్టిక్ ఔషధాలతో ఇది శారీరక ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది.
ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయే మలినాలు శారీరక పనితీరును మందగించేలా చేస్తాయని, అయితే అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయని ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎక్స్పరిమెంటల్ బయాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఆపై అల్లం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. అల్లం హ్యాంగోవర్లను నియంత్రించడంలో మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Read More :