Health | వారంలో ఎన్నిసార్లు నాన్వెజ్ తినొచ్చు? రోజూ మాంసాహారం తినడం మంచిదేనా?
Health | కొంతమంది ఇష్టం కొద్దీ, మరికొందరు జిమ్ డైట్లో భాగంగా మూడు పూటలా మాంసాహారం తీసుకుంటారు. ఇది ఎంత వరకూ ఆరోగ్యకరం. అలాగే, సాధారణ వ్యక్తులు వారంలో ఎన్నిసార్లు మాంసాహారం తీసుకోవచ్చు?
Health | కొంతమంది ఇష్టం కొద్దీ, మరికొందరు జిమ్ డైట్లో భాగంగా మూడు పూటలా మాంసాహారం తీసుకుంటారు. ఇది ఎంత వరకూ ఆరోగ్యకరం. అలాగే, సాధారణ వ్యక్తులు వారంలో ఎన్నిసార్లు మాంసాహారం తీసుకోవచ్చు?
-ఓ పాఠకురాలు
అత్యధికంగా ప్రొటీన్ను అందించే ఆహారం మాంసం. ఇందులో ప్రొటీన్ ‘బయో అవైలబిలిటీ’ అధికం. అంటే, ఒక ఆహారంలో ఎంత ప్రొటీన్ ఉన్నా.. దాన్ని శరీరం ఎంత శోషించుకుంటుంది అనేదే ముఖ్యం. ఇలా శోషించుకునే గుణాన్నే బయో అవైలబిలిటీ అంటారు. మాంసంలో శరీరానికి కావలసిన ప్రొటీన్ అధికంగా ఉంటుంది కాబట్టి, జిమ్ చేసి కండలు పెంచాలనుకునేవాళ్లు ఎక్కువగా తీసుకుంటారు. మరికొందరు మక్కువ కొద్దీ తింటారు. కారణం ఏదైనా మాంసాన్ని రోజూ మూడు పూటల తినడం ఆరోగ్యకరం కాదు. దీనికి బదులు రెండు పూటలు తినడం మేలు. నాన్వెజ్ వండే విధానం కూడా కీలకమే. ఉడకబెట్టి కూరలాగానో, సూప్లానో తీసుకుంటే ఫర్వాలేదు. వేపుళ్లు అస్సలు మంచివి కావు.
దీనివల్ల ఒంట్లో సంతృప్త కొవ్వులు అధికం అవుతాయి. బరువు పెరుగుతారు, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా మటన్లో కొలెస్ట్రాల్ అత్యధికం. అందుకే, దాని జోలికి ఎక్కువగా పోకపోవడం మంచిది. అంతేకాదు, నాన్వెజ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే, రోజుకు రెండుసార్లు తీసుకుంటే మేలు. అది కూడా రాత్రిపూటకు బదులు మధ్యాహ్నం తీసుకోవాలి. రోజూ ఒక గుడ్డు తిన్నా ఇబ్బంది ఉండదు. ఇక, మాంసాహారం వల్ల కిడ్నీల్లో యూరిక్యాసిడ్ ఎక్కువ అవుతుంది. శరీరం నుంచి బయటికి వెళ్లిపోవాల్సిన ఈ వ్యర్థ పదార్థం పేరుకుపోతే గౌట్ వ్యాధిలాంటివి వస్తాయి. సాధారణ వ్యక్తులు వారంలో మూడుసార్లు మాంసాహారం తీసుకుంటే చాలు. బీపీ, షుగర్ ఉన్నవాళ్లు రెండుసార్లు తినొచ్చు. ఒకసారి అన్నంతో, మరోసారి రాగి సంకటి లాంటివాటితో తీసుకోవచ్చు. ఎనీమియాతో బాధపడేవాళ్లు నెలకు ఒకసారి లివర్ కూర తింటే మంచి ఫలితం ఉంటుంది.
-మయూరి ఆవుల,న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

