గురక సమస్యను తగ్గించే ఇంటి చిట్కాలు..!
గురక | గాఢ నిద్రలో ఉన్నప్పుడు పక్కన పడుకున్న వారు ఎవరైనా గురక పెడితే అప్పుడు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు.

గాఢ నిద్రలో ఉన్నప్పుడు పక్కన పడుకున్న వారు ఎవరైనా గురక పెడితే అప్పుడు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. గురక పెట్టే వారి పక్కన ఎవరైనా పడుకుంటే వారికి ఇక అసలు నిద్ర పట్టదు. ఈ క్రమంలో ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే గురక సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.
కొద్దిగా పిప్పర్మెంట్ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.
అర టీ స్పోన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. దీంతో గురక సమస్య నుంచి బయట పడవచ్చు.
ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. గురక సమస్య తగ్గుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

