High Cholesterol Levels | అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో హృద్రోగ ముప్పు : స్టాటిన్స్‌తో చెక్
రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ (High Cholesterol Levels) పెరగడం గుండె పోటుకు ముప్పు కారకంగా వైద్యులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ (High Cholesterol Levels) పెరగడం గుండె పోటుకు ముప్పు కారకంగా వైద్యులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా కొందరు మందుల వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గుండె పోటు, స్ట్రోక్ ఘటనలు పెరుగుతూ ప్రాణాంతక పరిస్ధితిని కొనితెచ్చుకుంటున్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు ముఖ్యంగా స్టాటిన్స్ వాడకంపై అపోహలతో నష్టం వాటిల్లుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హై కొలెస్ట్రాల్ లెవెల్స్‌తో రక్తంలో కొవ్వుతో కూడిన వ్యర్ధాలు రక్తనాళాల్లో పేరుకుపోతాయి. ఈ వ్యర్ధాలు పెద్దవిగా అయినా, చీలినా గుండెపోటు, స్ట్రోక్ వంటి ఘటనలు ప్రాణాంతకంగా మారతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంలో స్టాటిన్స్ సమర్ధవంతంగా పనిచేస్తాయని నిరూపణ అయింది. దీంతో ఆయా వ్యక్తులు హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పుకు గురయ్యే అవకాశం గణనీయంగా తగ్గుతుంది.
రక్త నాళాల్లో కొలెస్ట్రాల్‌ను వెనక్కిమళ్లించడంతో పాటు రక్తనాళాల గోడల్లో పేరుకుపోయిన కొవ్వులో చీలికలను నివారించడంలోనూ స్టాటిన్స్ సమర్ధవంతంగా పనిచేస్తాయని వెల్లడైంది. స్టాటిన్స్ వాడకంతో ఆరంభంలో కండరాల నొప్పుల వంటి స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినా ఆపై సర్దుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉన్నవారు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు, నిత్యం పొగ తాగే అలవాటున్నవారు వైద్యుల సూచనలకు అనుగుణంగా స్టాటిన్స్ రోజూ తీసుకోవడం మేలని సూచిస్తున్నారు.
Read More :
Qualcomm | లేఆఫ్స్ ప్రకటించిన క్వాల్‌కాం : 1258 మంది ఉద్యోగులపై వేటు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

