ఎనీమియా ప్రభావం
మేడమ్ నమస్తే. నా వయసు ముప్పై రెండు. ఇద్దరు పిల్లలు. ఈ మధ్య నా జుట్టు తీవ్రంగా రాలిపోతున్నది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
మేడమ్ నమస్తే. నా వయసు ముప్పై రెండు. ఇద్దరు పిల్లలు. ఈ మధ్య నా జుట్టు తీవ్రంగా రాలిపోతున్నది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్స్ వాడినా ప్రయోజనం కనిపించడం లేదు. నన్నేం చేయమంటారు?
- ఓ పాఠకురాలు
జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు. అందులో ఎనీమియా ఒకటి. శరీరంలో తగినంత రక్తం లేని పరిస్థితి ఇది. ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది, నిస్సత్తువ, ఛాతీలో నొప్పి ఎనీమియా ఇతర లక్షణాలు. ఐరన్ లోపం, జీర్ణకోశ సంబంధమైన సమస్యలు, నెలసరిలో తీవ్ర రక్తస్రావం, గర్భధారణ, ఆహారాన్ని శరీరం సక్రమంగా శోషించుకోకపోవడం, వివిధ రుగ్మతల కారణంగా వాంతి, విరేచనాల ద్వారా రక్తం బయటికి రావడం, పొట్టలో హానికర సూక్ష్మజీవులు.. రక్త హీనతకు కారణాలు. ఐరన్ లోపాన్ని కూడా తేలిగ్గా తీసుకోలేం. ఒంట్లో ఇనుము లోపించినప్పుడు మనిషిని బలహీనత ఆవహిస్తుంది. ఇట్టే అలసట వచ్చేస్తుంది.
హృదయ స్పందన వేగం పెరుగుతుంది. నాలుగు అడుగులు వేసినా ఆయాసంగా అనిపిస్తుంది. మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడతారు. ఎనీమియా, ఐరన్ లోపం.. రెండూ తేలిగ్గా తీసుకోవాల్సిన సమస్యలు కాదు. ఇలాంటి సందర్భాల్లో జుట్టు రాలిపోవడాన్ని ఓ హెచ్చరికగా భావించి వైద్యులను సంప్రదించాలి. సమస్య ముదిరిపోతే పక్షవాతం, గుండెపోటు తదితర ఇబ్బందులూ ఎదురుకావచ్చు.
రక్త పరీక్షల ద్వారా హిమోగ్లోబిన్ లోపం ఏ స్థాయిలో ఉందో గుర్తించి, చికిత్స ప్రారంభిస్తారు. ఐరన్ సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆ లోపాన్ని సరిచేసుకోవచ్చు. నిపుణుల సలహాతో.. మార్కెట్లో లభిస్తున్న లోషన్లు, షాంపూలు, ఐరన్ మాత్రలు కూడా తీసుకోవచ్చు.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఇ.ఎన్.టి సర్జన్, ఎలర్జీ స్పెషలిస్ట్, ఫేషియల్ కాస్మటిక్ సర్జన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

