Health Tips | కీళ్ల నొప్పులా.. ఇలా చేస్తే కచ్చితంగా తగ్గుతాయట !
Health Tips | మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే.. మీ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడం. కింద రాసి ఉన్న కొన్ని పానీయాలు కీళ్ల సమస్య నుంచి మీకు ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో చదివేయండి మరీ..
Health Tips | మారుతున్న జీవన శైలి, మన ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారాలన్నీ దాదాపు రసాయనాలతోనే తయారవడంతో పాటు.. కూర్చున్న చోటే అన్ని పనులు చేస్తుండటం ఇందుకు కారణాలు కావచ్చు. ప్రతి ఐదుగురిలో కనీసం ముగ్గురు కీళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటి నుంచి బయట పడేందుకు వాకింగ్, రన్నింగ్ తో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోక తప్పదు. దీంతో పాటుగా కీళ్ల నొప్పులను నయం చేసేందుకు సహాయపడే ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే.. మీ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచడం. కింద రాసి ఉన్న కొన్ని పానీయాలు కీళ్ల సమస్య నుంచి మీకు ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో చదివేయండి మరీ..
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనోల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మిమ్మల్ని కాపాడి.. కీళ్ల నొప్పలు రాకుండా సహాయపడుతుంది.

పాలు
పాలు తాగడం వల్ల శరీరానికి కాల్షియం, విటమిన్-డీలతో పాటు ప్రొటీన్లు మెండుగా లభిస్తాయి. ఇవి మీ ఎముకలను, కీళ్లను ధృఢంగా మార్చి కీళ్ల సమస్యలను తగ్గిస్తాయి.

పాలలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
నారింజ రసం
విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నారింజ రసం.. మీ కీళ్ల ఆరోగ్యానికి బాగా సహాయపడతుంది.

చెర్రీ జ్యూస్
చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడమే కాక, ఇతర సమస్యల నుంచి పోరాడే శక్తినిస్తాయి.

నీరు
శరీరంలో అన్ని భాగాలు చక్కగా పని చేయాలంటే.. నీరు పుష్కలంగా తాగడం తప్పనిసరి. రోజంతా ఎక్కువ నీరు తాగుతుండటం వల్ల మీ కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

వాతావరణం చల్లగా మారినా సరే, వానకాలంలో తగిన మోతాదులో నీళ్లు తాగాల్సిందే. ఈ కాలంలో వాతావరణంలో కొన్నిసార్లు తేమ ఎక్కువ అవుతుంది. దీంతో అధికంగా చెమట పడుతుంది. శరీరం నుంచి ఫ్లూయిడ్స్ బయటికి వెళ్లిపోతాయి. కాబట్టి, రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తప్పనిసరి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, నిపుణులు, పలు రకాల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది. ఇవి పాటించే ముందు కచ్చితంగా వైద్యులను, డైటీషియన్లను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోగలరు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

