ఆరోగ్య ప్రదాయిని.. ఉగాది పచ్చడి
ఉగాది అనగానే.. ఇంటింటా సందడి. గుమ్మానికి తోరణాలు ఆహ్వానం పలుకుతాయి. వంటింటి ఘుమఘుమలు ఆకలిని పెంచుతాయి! ఇలా ఎన్ని ఉన్నా.. ఇంత ఉగాది పచ్చడి నోట్లో పడితే గానీ పండుగ పరిపూర్ణం కాదు. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి.
ఉగాది అనగానే.. ఇంటింటా సందడి. గుమ్మానికి తోరణాలు ఆహ్వానం పలుకుతాయి. వంటింటి ఘుమఘుమలు ఆకలిని పెంచుతాయి! ఇలా ఎన్ని ఉన్నా.. ఇంత ఉగాది పచ్చడి నోట్లో పడితే గానీ పండుగ పరిపూర్ణం కాదు. తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి.
జీవితం కూడా అన్ని రోజులూ ఒక్కలానే సాగిపోదు. సంతోషం, బాధ, కోపం, నిరాశ, భయం, ఆశ్చర్యాల మేళవింపుగా ఉంటుంది. ఆరు వేర్వేరు రుచులు కలిగిన ఉగాది పచ్చడి మనకు జీవితం వైవిధ్యభరితం.. మంచిచెడులను సమానంగా తీసుకోవాలని సూచిస్తుంది. వేపపూలు, మామిడికాయ, బెల్లం, మిరప, ఉప్పు, చింతపండు ప్రధాన పదార్థాలుగా ఉండే ఉగాది పచ్చడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి.
బెల్లం

- సహజమైన తియ్యదనాన్ని ఇస్తుంది.
- ఇందులోని ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.
- అరుగుదలకు సహకరిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- కాలేయాన్ని శుద్ధిచేయడంలో దోహదపడుతుంది.
చింతపండు

- ఇందులో ఉండే మెగ్నీషియం బీపీని అదుపులో ఉంచుతుంది.
- యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.
- డయాబెటిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది.
- ఇందులోని ఫ్లేవనాయిడ్లు కొలెస్ట్రాల్ స్థాయులను అదుపులో ఉంచుతాయి.
- యాంటి వైరల్, యాంటి సెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి.
వేపపూలు

- డయాబెటిస్‌ను అదుపుచేస్తాయి.
- రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి.
- శరీరంలో టాక్సిన్లను తొలగిస్తాయి.
- నోటి ఆరోగ్యానికి, మొటిమల నివారణకుసహకరిస్తాయి.
మిరప

- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
- క్యాల్షియం, యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.
- యాంటి ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది.
- శ్వాసవ్యవస్థకు ఉపశమనాన్ని ఇస్తుంది.
సైంధవ లవణం

- సోడియం నిధి.
- శరీరంలో నీటి నష్టాన్ని నివారిస్తుంది.
- అయాన్లను సమతూకంలో ఉంచి, ఫ్లూయిడ్లను నియంత్రణలో ఉంచుతుంది.
- మెదడు పనితీరు సవ్యంగా ఉండేలా దోహదపడుతుంది.
మామిడికాయ

Ugadi Pachadi
- శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా చూస్తుంది.
- గుండె, కాలేయం, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- స్కర్వీని నివారిస్తుంది.
- వికారం, వాంతులనునివారిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

