Soy milk benefits | సోయా మిల్క్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!
Soy milk benefits | సోయా పాలలో ఎన్నో పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. బర్రె పాలకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Soy milk benefits | వెగనిజం.. ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. వీరు ఎలాంటి నాన్-వెజ్ ఉత్పత్తులు తీసుకోరు. పూర్తిగా శాఖాహరంపై ఆధారపడి ఉంటారు. చివరకు బర్రె పాలను కూడా తాగకుండా ఉంటారు. ఒకవేళ పాలు వాడాల్సి వస్తే సోయా మిల్క్‌ను వాడుతుంటారు. నిజానికి సోయా మిల్క్ ఎంతో ఆరోగ్యకరమైనది. సోయాలో ఎన్నో క్యాలరీలు, ప్రోటీన్లతోపాటు కాల్షియం, పొటాషియం వంటి అద్భుత మూలకాలు ఉంటాయి. పాలు అంటే అసహనం ప్రదర్శించే వారికి సోయా మిల్క్ ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. సోయా పాలు ఆరోగ్యకరమైన బర్రె పాలకు ప్రత్యామ్నాయమైనది.
సోయా పాలతో ఆరోగ్య ప్రయోజనాలు..
సోయా పాలలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉండి ఎముకలు దృఢంగా ఉండేందుకు సహకరిస్తుంది. నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయని పలు నివేదికలు చెప్తున్నాయి. అలాగే మహిళల్లో మెనోపాజ్ తొలినాళ్లలో ఆస్టియోపోరోసిస్ ఇబ్బందుల నుంచి మనల్ని రక్షిస్తుంది.
మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాల కారణంగా సోయా పాలు కార్డియోవాస్కులార్ వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది. ఇది ప్లాస్మా లిపిడ్ స్థాయిలను మెరుగుపరచడంలో సాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
సోయా మిల్క్‌లో ఉండే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ శరీరం బరువు తగ్గడానికి అనువైన పానీయం. ఇది బీఎంఐపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటు నివారణలో సహాయపడుతుంది.
చిట్లిన జుట్టును ఆరోగ్యకరంగా తయారుచేయడంలో సోయా పాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రోటీన్-రిచ్ డైట్‌తో కలిపితే జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది.
సోయా మిల్క్ హైపర్పిగ్మెంటేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. చర్మానికి తేమను అందిస్తుంది. చర్మంపై ముదురు మచ్చలు, చర్మం రంగు మారడం వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకోవచ్చునని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

