బ్రౌన్ షుగర్‌తో అస్తమాకు చెక్ పెట్టొచ్చు..!
Health Tips: బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడకుండా ఉండాలన్నా, ఇప్పటికే అలాంటి అనారోగ్యాలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు

హైదరాబాద్: బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడకుండా ఉండాలన్నా, ఇప్పటికే అలాంటి అనారోగ్యాలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా బ్రౌన్ షుగర్‌ను కూడా వైద్యులు రిఫర్ చేస్తున్నారు. మరి బ్రౌన్ షుగర్‌లో ఉన్న గొప్పతనం ఏమిటో..? బ్రౌన్ షుగర్‌ను వినియోగించడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!
బ్రౌన్ షుగర్ లక్షణాలు
- వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక వైట్ షుగర్ ఎక్కువగా తీసుకోవడంవల్ల కేలరీలు పెరుగుతాయి. దానివల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంది.
- పైగా బ్రౌన్ షుగర్‌ను నేరుగా బెల్లం నుంచి సేకరిస్తారు. చెరుకు నుంచి కాదు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
- బ్రౌన్ షుగర్‌లో పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి మంచివి.
బ్రౌన్ షుగర్ తీసుకోవడంవల్ల కలిగే ప్రయోజనాలు..
- బ్రౌన్ షుగర్ తీసుకోవడంవల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. దాంతో మలబద్దకం సమస్య కూడా తీరుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవాలి.
- అదేవిధంగా తిమ్మిర్లను తగ్గించడానికి బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి కాళ్ల తిమ్మిరితోపాటు నొప్పిని తగ్గిస్తుంది.
- కేలరీలు తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి కూడా బ్రౌన్ షుగర్ తోడ్పడుతుంది. అలాగే జీవక్రియలను మెరుగుపరుస్తుంది.
- బ్రౌన్ షుగర్‌లో విటమిన్ బి6, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్గా పనిచేస్తాయి. అలాగే చర్మంపై మృత కణాలను తొలగించి స్క్రబ్‌గా పనిచేస్తాయి.
- బ్రౌన్ షుగర్ యాంటీ అలెర్జీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఇది ఉబ్బసం రోగులకు చికిత్సలో సహాయపడుతుంది.
- బ్రౌన్ షుగర్ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

