Turmeric Milk | వర్షాకాలంలో పసుపు పాలు తాగితే లభించే బెనిఫిట్స్ ఇవే..
Turmeric Milk | ఔషధగుణాలు ఉన్న పసుపు, పాలతో కలిపి తాగితే జలుబు, జ్వరం తగ్గడంతోపాటు వంటి నొప్పులు తగ్గుతాయి.
Turmeric Milk | వర్షాకాలంలో ఎప్పుడు ఎటువంటి అనారోగ్యం వస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు వర్షం కురుస్తుండటంతో మరోవైపు ఆఫీసుకు వెళ్లాలంటే బద్దకించే పరిస్థితి ఉంటుంది. తప్పని సరి పరిస్థితులు బ్యాగు భుజానికి తగిలించుకుని బయలుదేరితే.. మధ్యలోకి రాగానే వచ్చే వర్షంలో తడిసి ఆఫీసుకు చేరుకుంటాం. ఇలా వర్షంలో తడవడం వల్ల జలుబు చేస్తుంది.. అటుపై జ్వరం వస్తుంది. జ్వరం వస్తే మెడికల్ లీవ్ పెట్టొచ్చు. కానీ ఎక్కువ రోజులు సిక్ అయ్యే పరిస్థితి రావద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజువారీగా వంటకాల్లో వాడే పసుపులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో తరుచుగా వైరల్ ఇన్ ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, నేత్ర సమస్యలు వస్తుంటాయి. పసుపు పాలల్లో కలిపి తీసుకుంటే అందులో ఔషధ గుణాలు రెట్టింపవుతాయని పలు పరిశోధనల్లో తేలింది. పాలలోని పోషకాలు, పసుపులోని ఔషధగుణాలు కలగలిపి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంతోపాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కనుక ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలల్లో ఒక స్పూన్ పంచదార, చిటికెడు పసుపు కలుపుకుని తాగితే పలు బెనిఫిట్లు ఉంటాయి.
పసుపులో యాంటి సెప్టిక్, కర్కు మిన్ అనే పోషకాలు ఎక్కువ. పాలల్లో పసుపు కలిపి తీసుకోవడంతో ఊపిరితిత్తుల్లో కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. ముక్కు దిబ్బడతో తల పట్టేస్తే వేడివేడిగా పసుపు కలిపిన పాలు తాగితే రిలీఫ్ పొందొచ్చు. యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా గల పసుపు తల నొప్పి, ఇతర నొప్పుల నుంచి రిలీఫ్ లభిస్తుంది.
మహిళలు నెలసరి వేళ అధిక రక్త స్రావం సమస్యతో బాధ పడుతుంటారు. అటువంటి వారికి పసుపు కలిపిన పాలు మంచి ఔషధం. శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల పొత్తి కడుపులో నొప్పి, ఇతర ఒంటి నొప్పులతో బాధ పడుతుంటారు. ఈ సమస్యల నుంచి రిలీఫ్ కావాలంటే రోజూ క్రమం తప్పకుండా పసుపు కలిపిన పాలు తాగితే అతి తక్కువ టైంలోనే రుతుస్రావ బాధలు తగ్గుతాయి. నిద్రలేమితో బాధ పడుతున్న వారికీ పసుపు కలిపిన పాలు స్లీపింగ్ టానిక్. పాలల్లోని సెరటోనిన్, మెలటోనిన్ లు, పసుపులోని వైటల్ న్యూట్రియెంట్స్ కలిసి మానసిక ఒత్తిడి తగ్గించడంతో హాయిగా నిద్ర పోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
Cab Driver: భార్యను, ఆమె బంధువుల్లో ఆరుగుర్ని కడతేర్చిన క్యాబ్ డ్రైవర్
Kothagudem | ప్రేమించడమే ఆమె చేసిన నేరం.. భార్యను హతమార్చిన ఏఆర్ కానిస్టేబుల్..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

