జుట్టుకు జలగండం
నీళ్లు చాలా బాగున్నట్టుగానే కనిపిస్తాయి. మున్సిపాలిటీ నీళ్లు శుద్ధి చేశాకే ఇస్తారు. కాబట్టి వాటితో స్నానం చేస్తే చర్మానికి ఏ హానీ ఉండదని భావిస్తారు.
నీళ్లు చాలా బాగున్నట్టుగానే కనిపిస్తాయి. మున్సిపాలిటీ నీళ్లు శుద్ధి చేశాకే ఇస్తారు. కాబట్టి వాటితో స్నానం చేస్తే చర్మానికి ఏ హానీ ఉండదని భావిస్తారు. కానీ, మున్సిపాలిటీ ఇచ్చే నీరైనా, బోరు బావి నీరైనా వాటిల్లో కనిపించని రసాయనాలు తెలియకుండానే జుట్టుకు, చర్మానికి హాని చేస్తాయి. ముఖ్యంగా నాలుగు రకాల రసాయనాల వల్ల జరిగే అనర్థాలేమిటో తెలిస్తే.. జుట్టును, చర్మాన్ని కాపాడుకోవచ్చు.
క్లోరిన్: నీటి శుద్ధి కోసం క్లోరిన్ ఉపయోగిస్తారు. క్లోరిన్ కలిసిన నీళ్లతో తల స్నానం చేస్తే వెంట్రుకలు చిట్లిపోతాయి. అందువల్ల బలహీనపడిన వెంట్రుకలు తెగిపోయి జుట్టు పలుచబడినట్టుగా కనిపిస్తుంది.
ఫ్లోరైడ్: అధిక లోతు నుంచి నీటిని తోడినప్పుడు నీటితోపాటుగా భూమి పొరల్లోని ఫ్లోరైడ్ వస్తుంది. ఈ నీటిని ఉపయోగిస్తే తలపై తేమ తగ్గిపోతుంది. కొన్నాళ్లకు వెంట్రుకలు పలుచబడతాయి.
ఐసోప్రొఫైల్ ఆల్కహాల్: తలకు రాసే నూనెలు, క్రీముల్లో ఉండే ఐసోప్రొఫైల్ ఆల్కహాల్ వల్ల మాడు పొడిబారుతుంది. చర్మ ఆరోగ్యంపై ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుంది.
సల్ఫేట్స్: వాడే షాంపుల్లో చాలా వాటిలో సోడియం లారిల్ సల్ఫేట్ (ఎస్ఎల్ఎస్) ఉంటుంది. చర్మంపైన ఇది కఠినమైన డిటర్జెంట్గా పని చేస్తుంది. ఇది చర్మాన్ని పొడిగా మార్చడమే కాకుండా వెంట్రుకలకూ నష్టం కలిగిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

