Ghee Versus Olive Oil | నెయ్యి, ఆలివ్ ఆయిల్లో ఆరోగ్యానికి ఏది మేలంటే..!
మనం వంటింట్లో నూనెను వేపుళ్లు, తాలింపులు సహా పలు విధాలుగా వాడుతుంటాం. ఇక కొన్ని డిషెస్ కోసం నెయ్యి (Ghee Versus Olive Oil) కూడా వాడుతుంటారు.
న్యూఢిల్లీ : మనం వంటింట్లో నూనెను వేపుళ్లు, తాలింపులు సహా పలు విధాలుగా వాడుతుంటాం. ఇక కొన్ని డిషెస్ కోసం నెయ్యి (Ghee Versus Olive Oil) కూడా వాడుతుంటారు. నెయ్యి వాడకంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నా అన్ని రకాల ఆయిల్స్ మంచివి కాదని అర్ధం కాదు. మరోవైపు ఆలివ్ ఆయిల్ వాడకం ఆరోగ్యానికి మంచిదని కూడా చెబుతుంటారు. ఇక నెయ్యి, ఆలివ్ ఆయిల్లో ఏది మెరుగైనదనే అంశాన్ని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ మామి అగర్వాల్ ప్రస్తావించారు.
నెయ్యిని బాగా మరిగించినా ఓ స్ధాయి వరకూ హానికారక పదార్ధాలను విడుదల చేయదని, దీని స్మోక్ పాయింట్ చాలా నూనెలతో పోలిస్తే అధికమని ఆమె చెబుతున్నారు. వేపుళ్ల వంటి అధిక ఉష్ణోగ్రతలతో కూడిన వంటకు ఆయిల్స్ కంటే నెయ్యి మెరుగైనదని చెప్పారు. అందుకే భారతీయ వంటకాలకు నెయ్యి అనువైనదని తెలిపారు. ఇక ఆలివ్ అయిల్ అతితక్కువ స్మోక్ పాయింట్‌ను కలిగిఉండటంతో దీన్ని మరిగించలేమని మామి పేర్కొన్నారు. సలాడ్స్‌లో వాడేందుకు ఆలివ్ ఆయిల్‌కు అందుకే ఎక్కువగా మొగ్గుచూపుతుంటారని అన్నారు.
అధిక ఉష్ణోగ్రతల వద్ద వండే ఆహార పదార్ధాలకు ఆలివ్ ఆయిల్‌ను అవాయిడ్ చేయాలని మామి అగర్వాల్ సూచించారు. ఆలివ్ ఆయిల్లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను ఇతర పద్ధతుల్లో వాడుకోవచ్చని చెప్పారు. ఇక నెయ్యితో చేకూరే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇది శక్తిని అందించడంతో పాటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యానికి, గుండెకు నెయ్యి మేలు చేస్తుంది. బరువు తగ్గేందుకూ ఉపకరించే నెయ్యిని పరిమిత మోతాదులో తీసుకుంటే దాని ప్రయోజనాలను పూర్తిగా పొందేందుకు వీలుంది.
Read More :
Ankita Raina | బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన భారత టెన్నిస్ స్టార్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

