Health Tips | ఈ పండులో పోషకాలు మెండు : అద్భుత ఫలంతో క్యాన్సర్, బీపీ, రక్తపోటుకు చెక్!
పోషకాలు మెండుగా ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు ముందువరసలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పోషకాహార నిపుణులు జులియా జుంపానో వెల్లడించారు. తక్కువ క్యాలరీలు ఉండే దానిమ్మలో పోషకాలు అధికంగా ఉంటాయని చెప్పారు. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్‌తో పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి.
న్యూయార్క్ : పోషకాలు మెండుగా ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు ముందువరసలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పోషకాహార నిపుణులు జులియా జుంపానో వెల్లడించారు. తక్కువ క్యాలరీలు ఉండే దానిమ్మలో పోషకాలు అధికంగా ఉంటాయని చెప్పారు. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, క్యాన్సర్‌తో పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి.
క్యాన్సర్‌కు దారితీసే డీఎన్ఏ విధ్వంసాన్ని దానిమ్మలో ఉండే ఔషధ గుణాలు సమర్ధంగా నిరోధిస్తాయి. దానిమ్మ రసం రోజూ తీసుకుంటే క్యాన్సర్‌ను నిరోధించడమే కాకుండా శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. హానికారక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్‌తో పాటు అధిక రక్తపోటును దానిమ్మ రసం తగ్గిస్తుందని హార్వర్డ్ నివేదిక పేర్కొంది. దానిమ్మలో ఉండే పీచు పదార్ధాలు జీర్ణ క్రియ సాఫీగా జరిగేలా సహకరిస్తాయి.
దానిమ్మ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. రక్తకణాల్లో పేరుకుపోయిన వ్యర్ధాలను తగ్గించడంలో దానిమ్మ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సాయపడతాయని ఇజ్రాయల్‌లో జరిగిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. గుడ్ కొలెస్ట్రాల్‌గా పిలిచే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగేందుకు ఉపకరిస్తాయి. గర్భిణుల్లో శిశువు మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో దానిమ్మ పండు మేలు చేస్తుందని వెల్లడైంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- bp
- Cancer
- fruit
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

