Health tips | ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే బరువు తగ్గించే ఈ పండ్లు తినండి..!
Health tips | శరీరంలో కొవ్వుకు కారణమయ్యే పదార్థాలను దూరం పెడుతూ, కొవ్వు తగ్గించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వును తగ్గించడంలో కొన్ని రకాల పండ్లు బాగా పనిచేస్తాయి. మరి కొవ్వు కరిగించే ఆ పండ్లేవో ఇప్పుడు తెలుసుకుందాం...
Health tips : ఈ మధ్య కాలంలో చాలామంది బరువు పెరుగుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణం. బరువు పెరగకూడదన్నా, పెరిగిన బరువును తగ్గించుకోవాలన్నా మన జీవన విధానంతోపాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అంటే శరీరంలో కొవ్వుకు కారణమయ్యే పదార్థాలను దూరం పెడుతూ, కొవ్వు తగ్గించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వును తగ్గించడంలో కొన్ని రకాల పండ్లు బాగా పనిచేస్తాయి. మరి కొవ్వు కరిగించే ఆ పండ్లేవో ఇప్పుడు తెలుసుకుందాం…
బరువు తగ్గించే పండ్లు
కమలా పండ్లు : ఈ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేగాక విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లను తినడంవల్ల సులువుగా బరువు తగ్గుతారు.
కివీ పండ్లు : శీతాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లలో విటమిన్ సి, ఇ, ఫోలేట్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్టరాల్ను అదుపు చేసి బరువును తగ్గించడంలో ఈ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
ద్రాక్ష పండ్లు : ఈ ద్రాక్ష పండ్లలో కూడా నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు కూడా శరీర బరువు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతాయి.
ఆపిల్ పండ్లు : ఈ పండ్లు తీసుకోవడంవల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేగాక ఈ పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ పండ్లు తరచూ తినడంవల్ల కూడా సులువుగా బరువు తగ్గవచ్చు.
పుచ్చ పండ్లు : అధికంగా నీటి శాతం వుండే ఈ పండ్లను తినడంవల్ల అవలీలగా బరువు తగ్గుతారు. ఈ పండ్లలో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒంట్లోని కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
అరటి పండ్లు : ఏ సీజన్లో అయినా దొరికే ఈ పండ్లను తీసుకోవడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. వీటిలో చక్కెర శాతం అధికంగా ఉండడంతో ఇవి తిన్న తర్వాత చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా వాటిలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. తక్కువ మోతాదులో తీసుకున్నా ఎక్కువ శక్తి పొందే అవకాశం ఉన్నందున వీటితో బరువు పెరిగే అవకాశమే లేదు.
బెర్రీ పండ్లు : యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఎక్కువగా ఉండే బెర్రీస్ని తీసుకోవడంవల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా శరీర బరువూ తగ్గుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

