Foods | చలికాలంలో వ్యాయామం చేసే ముందు ఏ ఆహారం అయితే ఉత్తమం.. నిపుణులు ఏం సూచిస్తున్నారు..?
చలికాలంలో ఉదయం నిద్రలేచి వ్యాయామశాలకు వెళ్లడం కొంత కష్టంగా అనిపిస్తుంది. వ్యాయామానికి ముందు త్వరగా శక్తి రావాలనే ఉద్దేశంతో కొందరు కెఫీన్ కలిగిన పానీయాలు తీసుకుంటే, మరికొందరు సహజమైన పానీయాలను ఎంచుకుంటారు. అయితే వ్యాయామానికి సిద్ధం కావడానికి ఉత్ప్రేరకాలు కలిగిన ప్రత్యేక పానీయాలు తప్పనిసరి కాదు.
Foods | చలికాలంలో ఉదయం నిద్రలేచి వ్యాయామశాలకు వెళ్లడం కొంత కష్టంగా అనిపిస్తుంది. వ్యాయామానికి ముందు త్వరగా శక్తి రావాలనే ఉద్దేశంతో కొందరు కెఫీన్ కలిగిన పానీయాలు తీసుకుంటే, మరికొందరు సహజమైన పానీయాలను ఎంచుకుంటారు. అయితే వ్యాయామానికి సిద్ధం కావడానికి ఉత్ప్రేరకాలు కలిగిన ప్రత్యేక పానీయాలు తప్పనిసరి కాదు. అరటిపండు, పాలు, కొబ్బరినీళ్లు, పండ్ల రసం, ఓట్స్‌తో తయారుచేసిన పానీయాలు శరీరానికి ద్రవాలతోపాటు అవసరమైన పోషకాలను అందిస్తాయి. అయినప్పటికీ, ఏ సహజ పానీయం తాగినా వెంటనే శక్తి వస్తుందని చెప్పలేం. తగినంత నిద్ర, సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం కూడా అంతే ముఖ్యం. చలికాలంలో వ్యాయామానికి ముందు తీసుకోదగిన ఏడు సహజ పానీయాల గురించి పోషకాహార నిపుణులు వివరించారు.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, అరటి పండు స్మూతీ..
చలికాలంలో చల్లని నీరు తాగడం ఇష్టం లేనివారికి నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు మంచి ఎంపిక. వ్యాయామ సమయంలో శరీర పనితీరు సక్రమంగా ఉండేందుకు తగినంత నీరు అవసరం. నిమ్మరసం నీటికి రుచిని అందిస్తుంది. వ్యాయామానికి 15 నుంచి 30 నిమిషాల ముందు తీసుకోవచ్చు. అలాగే శారీరక శ్రమ సమయంలో శరీరానికి అవసరమైన శక్తిని అందించే ముఖ్యమైన పోషకం పిండి పదార్థాలు. అరటిపండులో ఇవి సమృద్ధిగా ఉంటాయి. కొన్ని గంటలుగా ఆహారం తీసుకోకపోయినా, ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామం చేయబోతున్నా అరటిపండు స్మూతీ ఉపయోగపడుతుంది. ఒక పండిన అరటిపండును 200 నుంచి 250 మిల్లీలీటర్ల పాలతో కలిపి మిక్సీలో వేసి తయారుచేసుకోవచ్చు. అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. అదనంగా చక్కెర లేదా పాకం వేయాల్సిన అవసరం లేదు. పూర్తిస్థాయి స్మూతీ తాగిన తర్వాత వ్యాయామానికి 60 నుంచి 90 నిమిషాల సమయం ఇవ్వడం మంచిది.
కొబ్బరి నీళ్లు, బీట్రూట్ రసం..
కొబ్బరినీళ్లలో నీటితోపాటు పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. వ్యాయామానికి ముందు తేలికపాటి రుచితో కూడిన పానీయం కావాలనుకునేవారికి ఇది ఒక ఎంపిక. కొంతమేర పిండి పదార్థాలను కూడా అందిస్తుంది. చక్కెర కలపని కొబ్బరినీళ్లను చిన్న గ్లాసు తీసుకోవచ్చు. వ్యాయామానికి 30 నుంచి 60 నిమిషాల ముందు తాగవచ్చు. ఉదయం వ్యాయామం చేసేవారు కడుపు నిండుగా ఉండే పానీయం కోరుకుంటే ఓట్స్ స్మూతీని ఎంచుకోవచ్చు. 20 నుంచి 30 గ్రాముల ఓట్స్‌ను 200 నుంచి 250 మిల్లీలీటర్ల పాలతో కలిపి మిక్సీలో వేసుకోవాలి. అదనపు రుచి, పిండి పదార్థాల కోసం సగం అరటిపండు కూడా కలుపుకోవచ్చు. వ్యాయామానికి 60 నుంచి 120 నిమిషాల ముందు దీన్ని తీసుకోవచ్చు. బీట్రూట్లో సహజంగా ఉండే నైట్రేట్ల కారణంగా క్రీడాకారుల ఆహారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలో ఈ నైట్రేట్లు నైట్రిక్ ఆక్సైడ్‌గా మారతాయి. ఇది రక్తనాళాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక చిన్న బీట్రూట్ను శుభ్రంగా కడిగి నీటితో కలిపి రసం తయారుచేసుకోవచ్చు. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కలపవచ్చు. దీన్ని వ్యాయామానికి 2 గంటల ముందు తీసుకోవాలి.
నారింజ రసం..
నారింజ రసంలో పిండి పదార్థాలు, నీరు ఉంటాయి. వ్యాయామానికి ముందు తాగేందుకు వీలుగా అర గ్లాసు నారింజ రసానికి సమాన పరిమాణంలో నీరు కలుపుకోవచ్చు. ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు లేదా ఎక్కువ సమయం వ్యాయామం చేయబోతున్నప్పుడు ఇది కొంత శక్తిని అందిస్తుంది. వ్యాయామానికి 30 నుంచి 60 నిమిషాల ముందు తాగవచ్చు. అలాగే చలికాలంలో వ్యాయామానికి వెళ్లే ముందు గోరువెచ్చని పాలు తాగడం కొందరికి సౌకర్యంగా ఉంటుంది. పాలతోపాటు చిన్న అరటిపండు తీసుకుంటే ప్రొటీన్, ద్రవాలు, పిండి పదార్థాలు అందుతాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే వ్యాయామం చేసేవారికి ఇది తేలికపాటి ఆహారంగా ఉపయోగపడుతుంది.
ఏది తీసుకోవాలి..
ఏ పానీయం తీసుకోవాలనేది చేయబోయే వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది. తక్కువ సమయం పాటు సాధారణ వ్యాయామం చేసేవారికి, అంతకుముందు సరైన ఆహారం తీసుకుని ఉంటే నీరు సరిపోతుంది. కొన్ని గంటలుగా ఆహారం తీసుకోకుండా కండరాల బలానికి సంబంధించిన వ్యాయామాలు చేసేవారు అరటిపండు లేదా కొద్దిపాటి అరటిపండు స్మూతీ తీసుకోవచ్చు. ఎక్కువసేపు వ్యాయామం చేసేవారికి అవసరాన్ని బట్టి పిండి పదార్థాలు కలిగిన పానీయం ఉపయోగపడుతుంది. వేడిగా ఉండే పానీయాలను ఇష్టపడేవారు నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు లేదా కొద్దిపాటి పాలు తీసుకోవచ్చు. ఎక్కువగా చెమట పట్టే తీవ్రమైన వ్యాయామాల సమయంలో శరీరానికి అవసరమైన ద్రవాలు, ఎలక్ట్రోలైట్లపై దృష్టి పెట్టాలి. ప్రతి సహజ పానీయంలోనూ తగినంత సోడియం ఉంటుందని భావించకూడదు. అయితే ఏ పానీయం తీసుకోవాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. వ్యక్తిగత అభిరుచులు, శరీర స్థితి, వాతావరణ పరిస్థితులు, చేసే వ్యాయామం, ఉన్న ఆరోగ్య సమస్యలు వంటి అన్ని అంశాలను బేరీజు వేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. అవసరం అయితే నిపుణుల సలహా పాటించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foods | చలికాలంలో వ్యాయామం చేసే ముందు ఏ ఆహారం అయితే ఉత్తమం.. నిపుణులు ఏం సూచిస్తున్నారు..?
పెన్‌పహాడ్‌లో అధిక ధరలకు మద్యం విక్రయాలు
Madhusudana Chary | కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.. రేవంత్‌ది సర్వ భ్రష్ట ప్రభుత్వం : మధుసూదనా చారి
Cristiano Ronaldo | ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో..!
పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

