Dandruff | చుండ్రు తీవ్రంగా ఉండి ఇబ్బందులు పెడుతుందా..? అయితే ఈ నాచురల్ టిప్స్‌ను పాటించి చూడండి..!
ప్రస్తుతం చాలా మందిని చుండ్రు సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
Dandruff | ప్రస్తుతం చాలా మందిని చుండ్రు సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఫంగస్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా, దీర్ఘకాలంగా మందులను వాడడం, థైరాయిడ్ వంటి వ్యాధులు ఉండడం, స్నానం చేసే నీరు, కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి చుండ్రు వస్తోంది. అయితే చర్మ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చుండ్రుకు మాత్రం కచ్చితంగా డాక్టర్ సలహాను తీసుకోవాలి. కానీ సాధారణ చుండ్రును పోగొట్టుకునేందుకు ఖరీదైన షాంపూలు, చికిత్సలు వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే అత్యంత సహజసిద్ధంగా చుండ్రును తొలగించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చుండ్రును తగ్గించేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో పనిచేస్తుంది. ఈస్ట్ లేదా ఫంగస్ జుట్టులో పెరగడాన్ని ఇది నిరోధిస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్..
యాపిల్ సైడర్ వెనిగర్‌ను కొద్దిగా తీసుకుని దానికి అంతే మొత్తంలో నీళ్లను కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుపై పోసి బాగా మర్దనా చేయాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. చుండ్రు నుంచి బయట పడవచ్చు. కొబ్బరినూనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. జుట్టు కుదుళ్లు పొడిగా ఉండడాన్ని నివారిస్తుంది. దీంతో చుండ్రు నుంచి బయట పడవచ్చు. కొబ్బరినూనెలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. కనుక ఫంగస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. దీంతో చుండ్రు నుంచి బయట పడవచ్చు. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. దీన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా రాయాలి. బాగా మర్దనా చేసిన తరువాత 30 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో 2 నుంచి 3 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. చుండ్రు పోవడమే కాకుండా శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి.
టీ ట్రీ ఆయిల్..
చుండ్రును తగ్గించి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచడంలో టీ ట్రీ ఆయిల్ కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఫంగస్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తాయి. చుండ్రు నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి. మీరు తరచూ ఉపయోగించే ఏదైనా షాంపూలో కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను కలిపి దాంతో జుట్టుకు బాగా మర్దనా చేయాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది. చుండ్రు పోతుంది.
కలబంద గుజ్జు..
కలబంద గుజ్జులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. తలలో వచ్చే దురదను ఇది తగ్గిస్తుంది. చుండ్రు తగ్గేలా చేస్తుంది. కలబంద గుజ్జును నేరుగా జుట్టుకు రాయవచ్చు. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు ఇలా చేస్తే చుండ్రును తగ్గించుకోవచ్చు. బేకింగ్ సోడా కూడా ఇందుకు బాగానే పనిచేస్తుంది. ఇందులో మైల్డ్ ఎక్స్ఫోలియెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మృత చర్మ కణాలను తొలగిస్తాయి. అధికంగా ఉండే ఆయిల్‌ను తగ్గిస్తాయి. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. జుట్టును ముందుగా తడి చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను తీసుకుని దాన్ని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా రాయాలి. బాగా మసాజ్ చేసిన తరువాత కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీళ్లతో కడిగేయాలి. కొద్ది రోజుల వరకు ఇలాగే చేయాలి. షాంపూ వాడకూడదు. దీంతో చుండ్రు పోతుంది. ఇలా పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి బయట పడవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

