Hair Fall | జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, దృఢంగా పెరగాలని కోరుకుంటున్నారా.. ఈ చిట్కాలను పాటించండి..
మెరిసే, దట్టమైన, పొడవైన జుట్టు కోసం సహజ మార్గాలు వెతుకుతున్నారా? అయితే పోషకాహార నిపుణులు సహజ చికిత్సలు, పురాతన ఆయుర్వేద పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. ఆయుర్వేద రహస్యాలను మళ్లీ అనుసరించడం ద్వారా, సరైన పోషకాహారం తీసుకుంటూ జుట్టు రాలడం తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
Hair Fall | మెరిసే, దట్టమైన, పొడవైన జుట్టు కోసం సహజ మార్గాలు వెతుకుతున్నారా? అయితే పోషకాహార నిపుణులు సహజ చికిత్సలు, పురాతన ఆయుర్వేద పద్ధతులు మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. ఆయుర్వేద రహస్యాలను మళ్లీ అనుసరించడం ద్వారా, సరైన పోషకాహారం తీసుకుంటూ జుట్టు రాలడం తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే సులభంగా ఇంట్లోనే పాటించగల కొన్ని చిట్కాలను కూడా వారు సూచిస్తున్నారు. మెరిసే, అందమైన జుట్టు కోసం ఇంట్లో పాటించగలిగే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ జ్యూస్, నట్స్..
ఆమ్లా (ఉసిరికాయ)లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరచడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం, హెయిర్ ఫాల్ తగ్గించడం వంటి ప్రయోజనాలు ఇస్తాయి. అదనంగా తల చర్మాన్ని శుభ్రంగా ఉంచి, డాండ్రఫ్ తగ్గించడంలో, ముందస్తు తెల్ల జుట్టును నివారించడంలో సహాయపడతాయి. ఆమ్లాను జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు లేదా ఆయిల్/మాస్క్గా ఉపయోగించవచ్చు. అలాగే బాదం, ఆక్రోట్స్ వంటి డ్రైఫ్రూట్స్ను రాత్రంతా నానబెట్టి తీసుకుంటే అవి సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉన్న విటమిన్ ఇ, బయోటిన్, హెల్తీ ఫ్యాట్స్ జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. రోజుకు 5-7 నానబెట్టిన బాదం తినడం వల్ల జుట్టు బలంగా, మెరిసేలా మారుతుంది.
ఉల్లిపాయ రసం..
అదే విధంగా ఉల్లిపాయ వాసన ఘాటుగా ఉన్నప్పటికీ జుట్టు పెరుగుదలలో ఇది సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ గుణాలు తల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఉల్లిపాయ రసాన్ని నేరుగా తలకు రాయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. ఇవే కాకుండా వేడి నూనెతో తలకు మసాజ్ చేయడం ఒక పాత సంప్రదాయం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి, తల చర్మాన్ని తేమగా ఉంచి, జుట్టు మూలాలను బలపరుస్తుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె వంటి నూనెలను స్వల్పంగా వేడి చేసి మెల్లగా మసాజ్ చేయడం ఉత్తమం. ఈ నాలుగు సులభమైన చిట్కాలను రోజువారీ జీవితంలో పాటిస్తే, క్రమంగా జుట్టు ఆరోగ్యం మెరుగై, దట్టంగా, మెరిసేలా మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

