Ayurveda Rules | ఆయుర్వేద ప్రకారం ఈ నియమాలను పాటిస్తే ఎలాంటి రోగాలు ఉండవు.. 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవిస్తారు..
ఆయుర్వేదానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచీనమైన వైద్య విధానాల్లో ఆయుర్వేదం ఒకటిగా పేరుగాంచింది. గతంలో ఆయుర్వేద వైద్యానికి అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు.
Ayurveda Rules | ఆయుర్వేదానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచీనమైన వైద్య విధానాల్లో ఆయుర్వేదం ఒకటిగా పేరుగాంచింది. గతంలో ఆయుర్వేద వైద్యానికి అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ప్రస్తుతం చాలా మంది ఈ వైద్య విధానంలో చికిత్స పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ సంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ సైతం లభిస్తోంది. అయితే ఆయుర్వేద అంటే కేవలం ఔషధాలు మాత్రమే కాదు, మన జీవన విధానానికి సంబంధించి అనేక సూత్రాలను అందించింది. కానీ చాలా మంది వాటిని పాటించడం లేదు. ఆహారపు అలవాట్లతోపాటు ఆరోగ్యం విషయంలోనూ ఆయుర్వేదం పలు సూత్రాలను, నియమాలను రూపొందించింది. వాటిని పాటిస్తే మన జీవన విధానం మెరుగు పడడమే కాదు, రోగాలు రాకుండా చూసుకోవచ్చు. 100 ఏళ్ల పాటు ఎలాంటి రోగాలు రాకుండా దీర్ఘాయుష్షుతో జీవనం సాగిస్తారు. ఇక మన ఆరోగ్యానికి ఆయుర్వేదం అందిస్తున్న ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరగడుపునే..
చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ లేదా కాఫీలను పరగడుపునే సేవిస్తుంటారు. కానీ ఆయుర్వేద ప్రకారం గోరు వెచ్చని నీళ్లను తాగాల్సి ఉంటుంది. అలా కాకుండా టీ, కాఫీలను తాగితే పొట్టలో యాసిడ్ల ప్రభావం పెరిగి దీర్ఘకాలంలో అల్సర్లు, ఇతర జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగితే ఎంతో మేలు జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతోపాటు శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. అలాగే బరువు కూడా తగ్గుతారు. ఇక చాలా మంది తమ బరువును చెక్ చేసుకోరు. ఆయుర్వేద చెబుతున్న ప్రకారం కనీసం 3 లేదా 4 రోజులకు ఒకసారి అయినా లేదా వారానికి ఒకసారి అయినా శరీర బరువును కచ్చితంగా చెక్ చేసుకోవాలి. దీని వల్ల మీరు ఎంత బరువు ఉన్నారు, తగ్గాలా, పెరగాలా అన్న విషయం సులభంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
బరువుకు తగినట్లుగా..
చాలా మంది తమ శరీర బరువుకు తగిన విధంగా ఆహారాలను తినరు. బరువు ఎక్కువగా ఉన్నవారు ఇంకా ఎక్కువ ఆహారాలను తింటారు. తక్కువ బరువు ఉన్నవారు సరిగ్గా ఆహారం తినరు. ఈ పద్ధతిని మార్చుకోవాలి. మీ శరీర బరువుకు తగినట్లుగా రోజూ ఆహారం తినాల్సి ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం రోజూ ఒకే సమయానికి భోజనం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒకే సమయానికి ఆహారాన్ని తినాలి. తీసుకునే భోజనంలో ద్రవ, ఘనాహారాలు ఉండాలి. జీర్ణాశయంలో పావు వంతు ఖాళీ ఉంచాలి. అప్పుడే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. భోజనానికి, భోజనానికి మధ్య కనీసం 4 నుంచి 5 గంటల వ్యవధి ఉండాలి. రోజులో ఒక్కసారి అయినా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలసి భోజనం చేయాలి.
వ్యాయామం తప్పనిసరి..
భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తాగరాదు. తప్పదనుకుంటే చాలా స్వల్పంగా నీటిని తాగాలి. భోజనానికి ముందు, భోజనం చేసేటప్పుడు, చేశాక ఎట్టి పరిస్థితిలోనూ చల్లని నీరు, పానీయాలను తాగరాదు. వారంలో ఒక్కసారి నూనెతో శరీరాన్ని మసాజ్ చేయాలి. ఇందుకు నువ్వుల నూనెను వాడితే మంచిది. దీని వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది. చక్కని వర్చస్సు సొంతమవుతుంది. వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. అలాగే శరీరం ఉన్న స్థితిని బట్టి నిత్యం వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తులు వారంలో కనీసం 3 రోజులు వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఇతర వ్యక్తులు వారంలో కనీసం 5 రోజులు, రోజుకు 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఇలా ఆయుర్వేద ప్రకారం పలు నియమాలను పాటిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు. 100 ఏళ్ల వరకు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేకుండా జీవిస్తారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- ayurveda
- health tips
- life
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

