Eyes Health | కళ్లు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే మీ దినచర్యలో ఈ మార్పులు చేసుకోండి..!
పూర్వ కాలంలో మన పెద్దలు 90 ఏళ్లు వచ్చినా కంటి చూపులో ఏమాత్రం తేడా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం చిన్నతనం నుంచే కళ్లద్దాలను వాడాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి.
Eyes Health | పూర్వ కాలంలో మన పెద్దలు 90 ఏళ్లు వచ్చినా కంటి చూపులో ఏమాత్రం తేడా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం చిన్నతనం నుంచే కళ్లద్దాలను వాడాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. మారిన జీవనశైలి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్లు, ఫోన్లు, టీవీ తెరలను అధికంగా చూడడం, పోషకాహార లోపం వల్లే చాలా మంది కంటి చూపు సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాగే చాలా మందికి కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ఇక 40 ఏళ్ల వయస్సు దాటితే చాలా మందికి కళ్లలో శుక్లాలు వస్తున్నాయని కంటి వైద్యులు చెబుతున్నారు. అయితే రోజువారి దినచర్యలో భాగంగా కొన్ని జాగ్రత్తలను పాటిస్తుంటే దాంతో కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే కంటి చూపు మెరుగు పడుతుంది. ఇక ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు..
కంటి చూపు లోపించేందుకు, కళ్ల సమస్యలు వచ్చేందుకు ముఖ్య కారణం పోషకాహార లోపమే. కనుక పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను తరచూ తీసుకుంటుండాలి. ముఖ్యంగా విటమిన్లు ఎ, సి, ఇలతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తినాలి. క్యారెట్లు, ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, చేపలను తరచూ తింటుంటే పైన చెప్పిన పోషకాలు అన్నీ లభిస్తాయి. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది.
కంప్యూటర్ల ఎదుట కూర్చునే వారు..
కంప్యూటర్ల ఎదుట గంటల తరబడి పనిచేసేవారికి ఈ టిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కంప్యూటర్ల ఎదుట కూర్చునే వారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉండే ఏదైనా వస్తువును కనీసం 20 సెకన్ల పాటు చూడాలి. దీన్నే 20-20-20 టెక్నిక్ అంటారు. ఈ చిట్కా వల్ల కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. బయట ఎండలో ఎక్కువగా తిరిగేవారు కళ్లకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు గాను కూలింగ్ గ్లాసెస్‌ను ఉపయోగించాలి. ఇవి అతినీలలోహిత కిరణాల ప్రభావం కళ్లపై పడకుండా కళ్లను రక్షిస్తాయి. దీంతో కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు దెబ్బతినకుండా ఉంటుంది.
కంటి పరీక్షలు..
ప్రతి ఏడాది కచ్చితంగా కంటి వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణంగా వయస్సు మీద పడే కొద్దీ కళ్లలో శుక్లాలు వంటివి వస్తుంటాయి. కంటి చూపు కూడా మందగిస్తుంది. అలాగే గ్లకోమా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఏడాదికి ఒకసారి అయినా సరే ఈ టెస్టులను చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్స తీసుకోవాలి. దీంతో కళ్లను ఆరోగ్యగంగా, సురక్షితంగా ఉంచుకోవచ్చు. రాత్రిపూట నిద్రకు ముందు చాలా మంది ఫోన్లను ఎక్కువగా చూస్తుంటారు. చీకట్లో ఫోన్ చూడడం వల్ల ఫోన్ వెలుతురు కళ్లపై పడి కళ్లు ఒత్తిడికి గురవుతాయి. దీంతో కళ్లలోని ద్రవం ఆవిరై పోతుంది. కళ్లు పొడిబారి దురద పెడతాయి. కనుక కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి పూట ఫోన్లను తక్కువగా వాడాలి. లేదా పూర్తిగా మానేయాలి. ఇలా పలు జాగ్రత్తలను పాటించడం వల్ల కళ్లను ఎల్లవేళలా సురక్షితంగా ఉంచుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- eyes health
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

