Delicious Chips : పిల్లల నుంచి పెద్దల వరకూ రోజులో ఏ సమయంలోనైనా చిప్స్‌ను ఆరగించేందుకు ఇష్టపడుతుంటారు. పొటాటో చిప్స్ పలు వెరైటీల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటిని అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటిని అదేపనిగా తింటే బరువు పెరగడం, బీపీ, హృద్రోగ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.
అయితే హాట్ స్నాక్స్ కోసం పొటాటో చిప్స్‌నే తినాల్సిన అవసరం లేదు. వీటికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి. పోషకాలతో కూడిన అయిదు ఆరోగ్యకర ప్రత్యామ్నాయాలను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ముందుగా బీట్రూట్ చిప్స్‌ను టేస్టీ, హెల్ధీ చిప్స్‌గా ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. బీట్రూట్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. దీంతో పాటు ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే స్వీట్ పొటాటో చిప్స్‌ను కూడా ఇంట్లోనే తయారుచేసుకుని తినవచ్చు. ఇక ఆలూ చిప్స్‌కు అయిదు ప్రత్యామ్నాయ చిప్స్‌ను పరిశీలిద్దాం..
బీట్రూట్ చిప్స్
స్వీట్ పొటాటో చిప్స్
గుమ్మడి చిప్స్
బనానా చిప్స్
క్యారట్ చిప్స్
Read More :