Fasting | వారంలో ఒక రోజు కచ్చితంగా ఉపవాసం ఉండండి.. ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయంటే..?
వారంలోని ఏడు రోజుల్లో దేవుళ్ల పేర్లు చెప్పి కొందరు ఉపవాసం ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా ఉపవాసం ఉంటారు కానీ ఇందులో సైన్స్ కూడా దాగి ఉంది. వారంలోని ఏదో ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని సైన్స్ కూడా చెబుతోంది.
Fasting | వారంలోని ఏడు రోజుల్లో దేవుళ్ల పేర్లు చెప్పి కొందరు ఉపవాసం ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా ఉపవాసం ఉంటారు కానీ ఇందులో సైన్స్ కూడా దాగి ఉంది. వారంలోని ఏదో ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయని సైన్స్ కూడా చెబుతోంది. ఉపవాసం వల్ల శరీరం అనేక ప్రయోజనాలను పొందవుతుంది. వారంలోని ఏదో ఒక రోజును ఎంచుకుని ఉపవాసం ఉంటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. ఉపవాసం ఉండడం వల్ల వారం మొత్తం మీద తీసుకునే క్యాలరీల సంఖ్యపై ప్రభావం పడుతుంది. దీంతో శరీరం క్యాలరీల కోసం కొవ్వును కరిగిస్తుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. అలాగే వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి.
కొవ్వు కరుగుతుంది..
సాధారణంగా మనం రాత్రి తిన్న తరువాత ఉదయం వరకు మన శరీరం ఖాళీగా మారుతుంది. దీంతో శక్తి కోసం చూస్తుంది. అయితే అలాంటి సమయంలో ఉపవాసం ఉంటే శరీరం శక్తి కోసం కొవ్వును కరిగిస్తుంది. అలా కనీసం మరో 12 గంటల పాటు ఉన్నా చాలు, కొవ్వు కరిగే ప్రక్రియ పెరుగుతుంది. దీంతో శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం కరిగిపోతుంది. ముఖ్యంగా పొట్ట దగ్గర, తొడల దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. దీని వల్ల బరువు తగ్గుతారు. కనుక వారంలో ఒక రోజు ఉపవాసం చేసే విధంగా నియమాన్ని పెట్టుకుని కచ్చితంగా దాన్ని పాటించండి. ఎంతో ప్రయోజనం లభిస్తుంది. వారంలో ఒక రోజు ఉపవాసం చేస్తే ఆకలి హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ఆహారం ఎంత తినాలి అనే విషయంపై నియంత్రణ సాధిస్తారు. దీంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
షుగర్ లెవల్స్ అదుపులో..
వారంలో ఒక రోజు ఉపవాసం ఉండడం వల్ల క్లోమగంథ్రికి విశ్రాంతి లభిస్తుంది. దీంతోపాటు శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలోకి వస్తాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఫాస్టింగ్ చేసే సమయంలో మందులను వాడకూడదు. లేదంటే షుగర్ లెవల్స్ మరీ అధికంగా పడిపోతే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో డాక్టర్ సలహా పాటించడం ఉత్తమం. వారంలో ఒక రోజు ఉపవాసం పాటించడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
కీళ్ల నొప్పులు, వాపులకు..
వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటే శరీరం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుంది. పాత కణాల స్థానంలో కొత్త కణాలను నిర్మిస్తుంది. దీంతో అన్ని అవయవాలు మళ్లీ పునరుత్తేజం చెంది యాక్టివ్గా మారుతాయి. ముఖ్యంగా చర్మం మరమ్మత్తులకు గురవుతుంది. కొత్త కణాలు వచ్చి కాంతివంతంగా కనిపిస్తారు. యవ్వనంగా మారిపోతారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఉండే వాపులు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. యాక్టివ్గా పనిచేస్తారు. చురుగ్గా ఉంటారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. నీరసం, అలసట ఉండవు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
వీరు చేయకూడదు..
గర్భంతో ఉన్న మహిళలు లేదా పాలిచ్చే తల్లులు ఉపవాసం ఉండడం మంచిది కాదు. టీనేజ్ వయస్సులో ఉన్నవారితోపాటు అంత కన్నా చిన్న వయస్సులో ఉన్నవారు, పిల్లలు కూడా ఉపవాసం చేయకూడదు. టైప్ 2 డయాబెటిస్ ఉంటే డాక్టర్ సూచన మేరకు ఉపవాసం చేయవచ్చు. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం చేయరాదు. కిడ్నీ, లివర్ వ్యాధులు ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ మందులను వాడుతున్నవారు, పోషకాహార లోపం ఉన్నవారు, బరువు తక్కువగా ఉన్నవారు, గౌట్ వంటి సమస్యలు ఉన్నవారు, వయస్సు మీద పడిన వారు ఉపవాసం చేయకూడదు. ఉపవాసం ఉన్న సమయంలో నీళ్లను అధికంగా తాగాలి. ఆకలికి తట్టుకోలేకపోతే తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లను తాగుతుండాలి. లేదా కేవలం పండ్లను మాత్రమే తినాలి. ఇలా ఉపవాసం చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Fasting
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

