Health tips : హైట్ పెరగాలంటే డైట్‌తో పాటు ఏం చేయాలంటే ..!
తాము తగినంత హైట్ పెరగడం లేదని టీనేజర్లలో చాలా మంది మధనపడుతుంటారు. ఎత్తును జీన్స్ 60 నుంచి 80 శాతం నిర్ధారిస్తే మిగిలిన 40 నుంచి 20 శాతం మన చేతుల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : తాము తగినంత హైట్ పెరగడం లేదని టీనేజర్లలో చాలా మంది మధనపడుతుంటారు. ఎత్తును 60 నుంచి 80 శాతం జీన్స్ నిర్ధారిస్తే మిగిలిన 40 నుంచి 20 శాతం మన చేతుల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు, రోజూ తీసుకునే ఆహారం, యాక్టివిటీస్, జీవన శైలి వంటివి టీనేజర్లలో హైట్ పెరగడంపై ప్రభావం చూపుతాయి. 19 ఏండ్ల వయసు వచ్చే వరకూ ఎత్తు పెరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎదిగే వయసులో తగిన మోతాదులో విటమిన్లు, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలని, అప్పుడే ఎత్తుతో పాటు శరీరంలో పెరుగుదల సజావుగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఎముకలు, కండర పుష్టికి అవసరమైన విటమిన్ డీ, క్యాల్షియం సరైన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. సీజన్లో లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. స్మోకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్లలో ఉండే నికోటిన్ పొగతాగే వారిలో ఆకలిని తగ్గించడంతో వారిలో ఎదుగుదల తగ్గిపోతుంది.
శరీర ఎదుగుదలకు తగినంత విశ్రాంతి, కంటినిండా నిద్ర అవసరం. టీనేజర్లు రోజుకు 9 నుంచి 10 గంటల పాటు నిద్రించడం ద్వారా వారి శరీరం బాగా ఎదుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమంలో పడుకోవడం కూడా ముఖ్యమేనని అప్పుడే వారు తాముండాల్సిన ఎత్తు పెరుగుతారని సూచిస్తున్నారు. నిలుచున్న సమయంలోనూ వెన్నెముక నిటారుగా ఉంచాలని, వంగినట్టుగా నడవడం, నిల్చోవడం కూడదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

