పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోకుండా ఉండాలంటే.. వేయించిన పదార్థాలను పక్కన పెట్టేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నూనెలను వేడి చేసినప్పుడు అందులో ట్రాన్స్ఫ్యాట్స్ ఏర్పడుతాయి. కాబట్టి, డీప్ ఫ్రై, నూనెతో తయారు చేసిన పదార్థాల్లో ఈ ట్రాన్స్ఫ్యాట్స్ ఎక్కువగా పేరుకు పోతాయి. ఆ పదార్థాలను తింటే.. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.
డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చేందుకూ ఆస్కారం ఉంది. నూనె పదార్థాలను మానేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. అప్పుడప్పుడూ ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ను అనుసరించాలి. అంటే రోజులో 6 గంటల పాటు మాత్రమే తిని, మిగతా 18 గంటల పాటు జీర్ణాశయాన్ని ఖాళీగా ఉంచాలి. ఇలా చేస్తే.. పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.