Teeth Health | బ్రష్ చేసుకునే సమయంలో డెంటిస్ట్ల కీలక సూచనలివే..!
Teeth Health : దంతాల ఆరోగ్యం, నోటి పరిశుభ్రతపై మన శరీర ఆరోగ్యం ఆధారపడిఉంటుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ద్వారా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.
Teeth Health : దంతాల ఆరోగ్యం, నోటి పరిశుభ్రతపై మన శరీర ఆరోగ్యం ఆధారపడిఉంటుంది. రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ద్వారా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అయితే మూడు సందర్భాల్లో బ్రష్ చేసుకోవడం అవాయిడ్ చేయడం మేలని ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సురిన సెహగల్ ఇన్స్టాగ్రాం రీల్లో వెల్లడించారు. ఈ మూడు సమయాల్లో వెంటనే బ్రష్ చేయడం దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ఆమె వివరించారు. తిన్న వెంటనే బ్రష్ చేయడం సరైంది కాదని, ఆహారం తీసుకోగానే నోరు ఆమ్లత్వానికి లోనవుతుందని ఇది పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుందని, తిన్న వెంటనే బ్రష్ చేయడం ద్వారా దంతక్షయం తీవ్రమయ్యేందుకు దారితీస్తుందని చెప్పుకొచ్చారు.
ఆహారం తీసుకున్న 30 నిమిషాల నుంచి గంట తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఈ క్రమంలో యాసిడ్స్‌ను లాలాజలం న్యూట్రలైజ్ చేసి నోటిలో పీహెచ్ లెవెల్‌ను సాధారణ స్ధితికి తీసుకువస్తుందని దంత వైద్యులు సూచిస్తున్నారు. ఇక మరికొందరు వాంతులు అయిన వెనువెంటనే బ్రష్ చేసుకుంటారని ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు పేర్కొంటున్నారు. వాంతులతో నోరు కడుపులోని ఆమ్లాలతో నిండిపోతుంది.
వెంటనే బ్రష్ చేయడంతో ఈ యాసిడ్స్ వ్యాప్తి చెంది దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. నోరు పీహెచ్ సాధారణ స్ధాయికి చేరిన తర్వాత కనీసం వాంతులైన అరగంట తర్వాత బ్రష్ చేసుకోవడం మేలని దంత వైద్యులు సూచిస్తున్నారు. ఇక కాఫీ తాగిన వెంటనే బ్రష్ చేసుకోరాదు. కాఫీ నోటిలో పీహెచ్ లెవెల్‌ను తగ్గించడంతో ఈ దశలో బ్రష్ చేసుకుంటే ఎనామిల్ దెబ్బతింటుంది. కాపీ తాగిన తర్వాత కనీసం అరగంట, గంట తర్వాత బ్రష్ చేసుకోవాలి. నోటి పరిశుభ్రతలో భాగంగా ఈ సూచనలు పాటించాలని డెంటల్ ప్రొఫెషనల్స్ చెబుతున్నారు.
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

