Health Tips | అవసరానికి మించి మందులు వాడుతున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు!
Health Tips | అవసరానికి మించి మందులు వాడటాన్నే ‘పాలిఫార్మసీ’ అంటారు. ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా.. ఒకేసారి నాలుగైదు రకాల ఔషధాలు వేసుకుంటున్నామంటే అది పాలిఫార్మసీ కిందికే వస్తుంది. దీనివల్ల మరిన్ని వైద్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవనశైలిలోనూ ప్రతికూల మార్పులు వస్తాయి. ఒక మందు మరో మందుతో కలవడం వల్ల ముప్పు పెరుగుతుంది.
Health Tips | అవసరానికి మించి మందులు వాడటాన్నే ‘పాలిఫార్మసీ’ అంటారు. ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా.. ఒకేసారి నాలుగైదు రకాల ఔషధాలు వేసుకుంటున్నామంటే అది పాలిఫార్మసీ కిందికే వస్తుంది. దీనివల్ల మరిన్ని వైద్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవనశైలిలోనూ ప్రతికూల మార్పులు వస్తాయి. ఒక మందు మరో మందుతో కలవడం వల్ల ముప్పు పెరుగుతుంది.
పాలిఫార్మసీ.. మామూలుగా ఒక మందు బదులుగా మరో మందు వాడితే వచ్చే సాధారణ రియాక్షన్ లాంటిది కాదు. ఇది శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆ ఔషధాలు క్రమంగా ఆ వ్యక్తి శరీరంపై సమర్థంగా పని చేయవు. ఇదో వృథా వ్యయం కూడా.
మలబద్ధకం
ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్, ఓపియాయిడ్ అనల్జీసిక్స్, క్యాల్షియం సప్లిమెంట్లు, మొదటి తరం యాంటీహిస్టమైన్స్, వెరాపమిల్ లేదా డిలిటియాజెం లాంటి మందులు మలబద్ధకానికి కారణమవుతాయి.
నోరు, కండ్లు పొడిబారడం
నోరు, కండ్లు పొడిబారడాన్ని ఓరల్ పాలిఫార్మసీ అంటారు. డైయూరిటిక్స్, డీకంజెస్టెంట్స్, యాంటీహిస్టమైన్స్ మందులు కండ్లను పొడిబారుస్తాయి. పెద్దల్లో నోరు పొడిబారడం సాధారణం. పాలిఫార్మసీ దాన్ని మరింత తీవ్రం చేస్తుంది. నోరు పొడిబారడం- డ్రైమౌత్ సిండ్రోమ్ లేదా జిరోస్టోమియా సమస్య గుండె రక్తనాళాల మందులు, సెడేటివ్స్, యాంటీడిప్రెసెంట్స్, సెంట్రల్ అనల్జీసిక్స్, యాంటాసిడ్స్ మొదలైన వాటివల్ల వస్తుంది.
పోషకలేమి
పెద్దల్లో పోషకాల సమస్యలు కూడా సహజంగా వచ్చేవే. పాలిఫార్మసీ వాటికి తోడవుతుంది. 75 ఏండ్లు దాటిన పెద్దల్లో పాలిఫార్మసీ, పోషకలేమికి సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఒకే సమయంలో వివిధ రకాల మందులు వేసుకోవడం వల్ల ఆహార చక్రం దెబ్బతింటుంది. జీవక్రియలపైనా వేటు పడుతుంది. దీంతో పోషకాల సమస్య తలెత్తుతుంది.
మూత్రం ఆపుకోలేక..
పాలిఫార్మసీ పెద్దల్లో మూత్రం ఆపుకోలేకపోయే ఇబ్బందికి దారితీస్తుంది. హార్మోన్ రీప్లేస్మెంట్, యాంటీసైకోటిక్స్, బెంజోడయాజెపైన్స్, యాంటీడిప్రెసెంట్స్ మొదలైన మందులు ఈ సమస్యకు కారణమవుతాయి.
తలతిప్పడం
మందుల కారణంగా పెద్దల్లో తలతిప్పడం సహజమే. అయితే, మందులు ఎక్కువయ్యే కొద్దీ ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. కేంద్రనాడీ మండల రుగ్మతలకు వాడే మందుల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. గుండె రక్తనాళాల సమస్యలు, నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళన లాంటి మానసిక సమస్యల చికిత్సకు వాడే మందులు దీనికి కారణాలు.
హైపోైగ్లెసీమియా
డయాబెటిస్ ఉన్న పెద్దలు మోతాదుకు మించి మందులు వేసుకోవడం వల్ల హైపోైగ్లెసీమియా ముప్పు అధికం. రక్తంలో చక్కెర స్థాయులు అవసరమైన దానికంటే తక్కువ కావడమే హైపోైగ్లెసీమియా.
జ్ఞాపకశక్తి సమస్యలు
బెంజోడయాజెపైన్స్, యాంటీహిస్టమైన్స్, ఓపియాయిడ్ అనల్జీసిక్స్, ఆక్సిబ్యుటినిన్ లాంటివి జ్ఞాపకశక్తి సమస్యలకు కారణమవుతాయి. ఈ మందులు వాడే పెద్దలు కొత్త విషయాలను నేర్చుకోవడం, కొత్తవాటిని గుర్తుంచుకోవడం, రోజువారీ పనుల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

